Begin typing your search above and press return to search.
గులాబీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి మీద సొంత కూతురే పోలీసులకు ఫిర్యాదు
By: Tupaki Desk | 9 May 2023 9:26 AM GMTవివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే గులాబీ ఎమ్మెల్యే.. కమ్ జనగాం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన.. సంచలనాలకు.. షాకులకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తుంటారు.
వివాదాలకు నిలువెత్తు రూపంగా నిలుస్తారన్న పేరున్న ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి మీద ఆయన సొంత కుమార్తె సంచలన ఆరోపణలు చేశారు. సొంత కుమార్తె బీఆర్ఎస్ ఎమ్మెల్యే మీద తిరగబడిన వైనం హాట్ టాపిక్ గా మారింది.
సిద్దిపేట జిల్లా చేర్యాలలో తనకు సంబంధించిన 1.2 ఎకరాల భూమిని తన తండ్రి కమ్ ఎమ్మెల్యే ముత్తి రెడ్డి అక్రమించినట్లుగా ఆమె ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించిన పేపర్లను చూపిస్తున్నారు. తన సంతకాన్నిఫోర్జరీ చేసి భూముల్ని తీసుకున్నట్లుగా ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసినట్లుగా చెబుతున్నారు.
ఉప్పల్ పోలీస్ స్టేషన్ లోనే ఆమె కంప్లైంట్ ఇచ్చినా ఫలితం లేదంటున్నారు. పోలీసులు ఇప్పటివరకు కేసును రిజిస్టర్ చేసుకోలేదని చెబుతున్నారు.
ఈ ఉదంతానికి సంబంధించిన వివరాలు వాట్సాప్ గ్రూపుల్లో షేర్ అవుతున్నాయి. అయితే.. పోలీసు అధికారులు మాత్రం ఎమ్మెల్యే మీద ఆయన కుమార్తె ఫిర్యాదు ఇచ్చారా? లేదా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.
దీనిపై నోరు మెప్పేందుకు ఏ పోలీసు అధికారి ముందుకు రాకపోవటం గమనార్హం. నిజంగానే కుమార్తె ఆస్తిని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి తన స్వాధీనంలోకి తీసుకొచ్చారా? లేదా? అన్నది మాత్రం తేలాల్సి ఉంది.