Begin typing your search above and press return to search.
రాత్రి నుంచి వైసీపీ ఎమ్మెల్యే ఫోన్ చేస్తే.. సీఐ లైట్ తీసుకోవటమేంటి?
By: Tupaki Desk | 29 April 2021 2:55 AM GMTఏపీ విపక్ష నేతలు తరచూ పోలీసుల మీదా ఫైర్ అవుతుంటారు. తాము చేసే కంప్లైంట్లను పోలీసులు తీసుకోవటం లేదని.. ఆ మాటకు వస్తే తమకు ఎదరయ్యే సమస్యల్ని వారి వరకు తీసుకెళుతున్నా.. పట్టించుకోవటం లేదన్న విమర్శ తరచూ వినిపిస్తూ ఉంటుంది. ఇక.. ఏపీ విపక్ష నేత చంద్రబాబు గురించి చెప్పాల్సిన అవసరం లేదు. పోలీసుల తీరుపై ఆయన గుర్రుగా ఉంటారు. పలుమార్లు హెచ్చరికలు జారీ చేశారు కూడా. విపక్ష నేతల విషయంలో ఏపీ పోలీసులు పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారన్న మాటకు జతగా.. ఇప్పుడు అధికార పార్టీ ఎమ్మెల్యే పలుమార్లు ఫోన్ చేసినా లైట్ తీసుకున్న వైనం హాట్ టాపిక్ గా మారింది.
రాత్రి నుంచి పక్కరోజు మధ్యాహ్నం వరకు సీఐకు ఫోన్ చేస్తే.. ఫోన్ ఎత్తని వైనంపై ఏపీ అధికారపక్ష ఎమ్మెల్యే తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన వైనం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. క్రిష్ణా జిల్లా నూజివీడు ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావుకు ఇలాంటి చేదు అనుభవం ఎదురైంది. దీంతో.. తీవ్ర ఆగ్రహానికి గురైన ఆయన పోలీస్ స్టేషన్ ఎదుట రెండు గంట లపాటు భైఠాయించే వరకు వెళ్లటం గమనార్హం.
అగిరిపల్లి మండలం తోటపల్లిలో నరేగా నిధులతో మురుగు కాలువ నిర్మాణం చేపడితే.. టీడీపీ మద్దతుదారుడైన సర్పంచి వైసీపీ కార్యకర్తలపై దాడికి పాల్పడ్డారు. దీంతో.. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినా.. పోలీసులు స్పందించలేదు. బుధవారం కూడా పనికి వెళ్లిన వారిపై సర్పంచి దాడికి దిగారు. దీంతో.. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే స్థానిక సీఐ.. డీఎస్పీలకు ఫోన్ చేశారు. అయినప్పటికి వారు అందుబాటులోకి రాలేదు.
తర్వాత ఫోన్ రిసీవ్ చేసుకున్న డీఎస్సీ 45 నిమిషాల్లో సమాచారం ఇస్తానని చెప్పి.. మళ్లీ ఫోన్ చేయకపోవటం.. స్థానిక సీఐ అసలు పట్టనట్లుగా వ్యవహరించటంపై ఆగ్రహానికి గురైన ఎమ్మెల్యే పోలీస్ స్టేషన్ వద్ద నిరసన తెలుపు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మూడుసార్లు ఎమ్మెల్యే అయిన తాను.. ఒక శక్తివంతమైన ముఖ్యమంత్రి దగ్గర పని చేస్తున్నానని.. పోలీసులు ప్రవర్తించాల్సిన తీరు ఇదేనా? అంటూ ప్రశ్నించారు. ఈ ఇష్యూలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకోవటం.. ఎమ్మెల్యే నిరసన తెలుపుతున్న పోలీసుస్టేషన్ వద్దకు వచ్చిన డీఎస్పీ.. సీఐలు ఆయనకు నచ్చజెప్పి స్టేషన్ లోపలకు తీసుకెళ్లి చర్చించారు. దాంతో వివాదం సద్దుమణిగింది.