Begin typing your search above and press return to search.
ఉచితంగా ఇళ్లు కట్టిస్తామని చెప్పి ఇప్పుడు రూ.35వేలు అడుగుతారేం?
By: Tupaki Desk | 19 May 2023 8:55 AM GMTవిజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో నిర్వహించిన గడప గడపకు వైసీపీ సర్కారుకార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు సమస్యలు స్వాగతం పలుకరించాయి. పలువురు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం చెప్పలేని పరిస్థితి నెలకొంది.
అన్నింటికి మించి ఒక పెద్ద వయస్కుడు అడిగిన ప్రశ్నలకు జవాబులు ఇవ్వలేని పరిస్థితి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇంటి స్థలం ఇచ్చి.. ఉచితంగా ఇల్లుకట్టిస్తామని బహిరంగంగా చెప్పారని.. అలాంటప్పుడు ఇల్లు మీరు కట్టుకుంటారా? ప్రభుత్వం కట్టించి ఇవ్వాలన్న ఆప్షన్ ఏమిటి? అని ప్రశ్నించారు.
అంతేకాదు.. 'ఈ రెండు ఆప్షన్లు ఎవరికి ఇచ్చినా ప్రభుత్వమే కట్టించి ఇవ్వాలని చెబుతారు. నేను అలానే ఆప్షన్ ఇచ్చాను. ఇంటి పట్టా ఇచ్చి రెండేళ్లు అవుతుంది. ఇప్పటికి నిర్మాణం పూర్తి కాలేదు. మళ్లీ ఇప్పుడు రూ.35 వేలు కట్టాలని ఒత్తిడి తెస్తున్నారు.
ఎందుకు కట్టాలి? ఇదేనా సంక్షేమం అంటే?" అని ప్రశ్నించిన పెద్ద వయస్కుడి ప్రశ్నలకు సమాధానా చెప్పలేకపోయారు విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు.. 59వ డివిజన్ కార్పొరేట్ షాహినా సుల్తానా. ఈ సందర్భంగా మరో ఆసక్తికర వ్యాఖ్య వచ్చింది. రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారన్న ఆ పెద్ద మనిషి.. ఇదేం పాలన అంటూ విస్మయాన్ని వ్యక్తం చేశారు.
మల్లాది విష్ణు చేపట్టిన గడప గడపకు వైసీపీ సర్కారు కార్యక్రమంలో.. చాలా మంది టిడ్కో ఇళ్లకు డబ్బులు కట్టమని అడుగుతున్నారని.. తాము కట్టలేమని స్పష్టం చేశారు. తాజాగా నిర్వహించిన కార్యక్రమంలో సగానికి పైగా ప్రజలు తమ సమస్యల్ని తీసుకొచ్చారు.
ఇంటి నిర్మాణానికి రూ.35వేలు కట్టాలన్న దానికి వ్యతిరేకత వ్యక్తమైంది. మరి.. దీనిపై వైసీపీ సర్కారు ఎలాంటి నిర్ణయాన్ని తీసుకుంటుందో చూడాలి.