Begin typing your search above and press return to search.
అంకుల్ రెస్ట్ మోడ్...వారసుడు రెడీ... ?
By: Tupaki Desk | 3 March 2022 2:30 AM GMTరాజకీయ చిత్రాలు అన్నీకలసి ఒక్క కడపలోనే ఇపుడు చోటు చేసుకుంటున్నాయి అని చెప్పాలి. కడపలో రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి వచ్చే ఎన్నికలలో వైసీపీ నుంచి పోటీ చేస్తారా చేయరా అన్న చర్చ ఒక వైపు ఉండగానే మరో వైసీపీ ఎమ్మెల్యే కమలాపురం అసెంబ్లీకి చెందిన పి రవీంద్రనాధ్ రెడ్డి పాలిటిక్స్ కి ఇక చాలు అనేస్తున్నారు.
ఆయన ఇప్పటికి రెండు సార్లు కమలాపురం నుంచి గెలిచారు. 2014, 2019లో ఆయనే ఎమ్మెల్యే. మరో టెర్మ్ కూడా ఉండొచ్చు. కానీ వద్దు అని ఆయనే స్వయంగా చెబుతున్నారుట.
ఎమ్మెల్యే అవుదామని వచ్చా, రెండు సార్లు వరసబెట్టి గెలిచా. ఆ సంతృప్తి ఉంది. ఇక గుడ్ బై అని సన్నిహితులతో రవీంద్రనాధ్ చెబుతున్నట్లుగా ప్రచారం సాగుతోంది. అదే టైమ్ లో తాను స్వస్తి చెప్పినా తన వారసుడుగా కుమారుడు నరేన్ రామాంజులరెడ్డిని బరిలోకి దించాలని చూస్తున్నారుట.
కొడుకుని ఇప్పటికే చింతకొమ్మదిన్నె నుంచి జెడ్పీటీసీగా బరిలోకి దింపి ఏకగ్రీవంగా గెలిపించుకున్న రవీంద్రనాధ్ రెడ్డి రానున్న రోజుల్లో ఎమ్మెల్యేగా చూడాలని ముచ్చట పడుతున్నారుట. ఇక చింతకొమ్మదిన్నె నుంచే గతంలో రవీంద్రనాధ్ రెడ్డి కూడా రాజకీయ అరంగేట్రం చేశారు.
ఆయన జెడ్పీటీసీగా గెలిచి జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గానూ ఆ తరువాత కడప మేయర్ గా కూడా పనిచేశారు. ఒక విధంగా చింతకొమ్మదిన్నె ప్రాంతం తమ కుటుంబానికి అచ్చి వచ్చినదిగా రవీంద్రనాధ్ రెడ్డి భావిస్తున్నారు.
అందుకే కొడుకుని అక్కడ నుంచి జెడ్పీటీసీగా దించేశారు. ఇక ఎమ్మెల్యే సీటే తరువాయి. అయితే రెండు సార్లు ఎమ్మెల్యే అయిన రవీంద్రనాధ్ రెడ్డి మీద వ్యతిరేకత నియోజకవర్గంలో ఉంది. దాంతో పాటు ఆయన నియోజకవర్గ సమస్యలు ఏవీ అసలు పట్టించుకోరు అన్న విమర్శలు ఉన్నాయి.
దాంతో ఆయన వచ్చే ఎన్నికల్లో పోటీ చేసినా గెలుపు కోసం కష్టపడాలి అన్న సంకేతాలు ఉన్నాయట. మరి అలాంటి చోట ఫస్ట్ టైమ్ కొడుకుని దింపు గెలుపు సాధించాలీ అంటే రవీంద్రారెడ్డికి ఇది సవాల్ అని అంటున్నారు. చూడాలి మరి.