Begin typing your search above and press return to search.
ఈడ్చుకెళ్లండి..నే చూసుకుంటా..వైసీపీ ఎమ్మెల్యే ఆగ్రహం!
By: Tupaki Desk | 20 Sep 2020 1:00 PM GMTఅనంతపురం జిల్లా శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి ఉగ్రరూపం దాల్చారు. తన కాన్వాయ్ ను అడ్డుకున్న ఏబీవీపీ నాయకులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆమె మాటలు ఇప్పుడు వైరల్ అయ్యాయి.
ఓ ప్రభుత్వ వైద్యశాలను ప్రారంభించడానికి వస్తున్న ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి - ఎడ్యుకేషనల్ సీఈవో ఆలూరు సాంబశివరారెడ్డి - కలెక్టర్ గంధం చంద్రుడు కాన్వాయ్ ను ఏబీవీపీ నాయకులు నార్పల గాంధీ సర్కిల్ వద్ద అడ్డుకున్నారు.
దీంతో కారు దిగి ఒక్కసారిగా కోపోద్రిక్తురాలైన వైసీపీ ఎమ్మెల్యే పద్మావతి ఏబీవీపీ నాయకులను చూసి ఊగిపోయారు.‘వాళ్లను ఈడ్చుకెళ్లి స్టేషన్ లో వేయండి. తర్వాత నేను వచ్చి మాట్లాడుతా’ అంటూ శింగనమల ఎమ్మెల్యే ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. ‘ఏం తమాషా చేస్తున్నారా? వీరిని ముందు స్టేషన్ కు తీసుకెళ్లండి’ అంటూ పోలీసులను ఆదేశించారు. వెంటనే పోలీసులు ఆందోళన కారులను అరెస్ట్ చేసి బలవంతంగా జీపుల్లో ఎక్కించి స్టేషన్ కు తరలించారు.
కాగా నార్పల బాలిక వసతి గృహాన్ని శ్మశానం వద్ద నిర్మించకూడదని ఎన్నిసార్లు ఆర్జీలు ఇచ్చినా పట్టించుకోలేదంటూ ఏబీవీపీ నాయకులు ఎమ్మెల్యే కాన్వాయ్ ఎదుట భైటాయించి నిరసన తెలిపారు.