Begin typing your search above and press return to search.

కేసీఆర్ పై ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

By:  Tupaki Desk   |   25 July 2021 5:02 AM GMT
కేసీఆర్ పై ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
X
ముఖ్య‌మంత్రి కేసీఆర్ పేద‌ల భూముల‌ను లాక్కుంటున్నార‌ని, బాధితులు త‌మ గోడు చెప్పుకోవ‌డానికి క‌లెక్ట‌ర్ల వ‌ద్ద‌కు వెళ్తే.. వాళ్లు క‌ల‌వ‌కుండా ఫామ్ హౌజ్ లో ప‌డుకుంటున్నార‌ని తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. కాంగ్రెస్ హ‌యాంలో పేద‌ల‌కు ఇచ్చిన భూముల విలువ పెరిగింద‌న్న జ‌గ్గారెడ్డి.. ఇప్పుడు ఆ భూముల‌ను కేసీఆర్ బ‌ల‌వంతంగా లాక్కుంటున్నార‌ని ఆరోపించారు.

సిద్ధాపూర్‌, కొండాపూర్ లో పేద‌ల ఇళ్ల కోసం ఇచ్చిన వంద ఎక‌రాల భూమిని ప్ర‌భుత్వం అమ్మ‌కానికి పెట్టింద‌ని అన్నారు. ఇక్క‌డ ఎక‌రం భూమి 3 కోట్ల రూపాయ‌లు ప‌లుకుతోంద‌ని అన్నారు. సంగారెడ్డి జిల్లాలో అసైన్డ్ భూముల‌ను కూడా టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు కొనుగోలు చేశార‌ని చెప్పారు. త‌మ‌వారికి క‌ట్ట‌బెట్టేందుకే ఈ అమ్మ‌కాల‌కు తెర‌తీశార‌ని జ‌గ్గారెడ్డి ఆరోపించారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంద‌ని అన్నారు.

ఇక‌, మాజీ ఐపీఎస్ ఆర్‌.ఎస్ ప్ర‌వీన్ కుమార్ గురించి కూడా ప్ర‌స్తావించారు. కాంగ్రెస్ ముఖ్య‌మంత్రి కిర‌ణ్ కుమార్ రెడ్డి ఉన్న‌ప్పుడే.. గురుకులాల కార్య‌ద‌ర్శిగా ప్ర‌వీణ్ కుమార్ అవ‌కాశం ఇచ్చార‌ని గుర్తు చేశారు. ఇప్పుడు ఆయ‌న రాజీనామా చేసి, రాజ‌కీయంగా అడుగులు వేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ముఖ్య‌మంత్రి కేసీఆర్ ను ప్ర‌వీణ్ కుమార్ నిల‌దీయాల‌ని జ‌గ్గారెడ్డి సూచించారు. ద‌ళిత ముఖ్య‌మంత్రి హామీ మొద‌లు, మూడెక‌రాల భూమి వ‌ర‌కు కేసీఆర్ ఎన్నో మోసాలు చేశార‌ని, వాటిని నిల‌దీయాల‌ని సూచించారు.