Begin typing your search above and press return to search.
'రాముడు-అల్లా ఎప్పుడైనా కొట్టుకున్నారా?'
By: Tupaki Desk | 24 Jan 2023 3:23 PM GMTమాటల మాంత్రికుడు, పొలిటికల్ ఫైర్ బ్రాండ్ సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. అది కూడా రెండు మతాలకు సంబంధించిన వ్యాఖ్యలు కావడంతో చర్చకు దారితీశాయి. సంగారెడ్డి జిల్లా సదాశివాపేట మండలం ఆత్మకూర్ గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం జగ్గారెడ్డి మాట్లాడుతూ.. పాతబస్తీ గొడవలు, హిందూ, ముస్లింల మధ్యసంబంధాలను ప్రస్తావించారు.
ఈ సందర్భంగా 'శ్రీరాముడు, అల్లా మధ్య ఏమైనా పంచాయితీ ఉందా..? ఎప్పుడైనా వారు కొట్టుకున్నారా.. మీరు చూశారా..? వాళ్లకు లేని బాధ మనకెందుకు.. మనం ఎంతుకు అన్నదమ్ముల్లెక్క ఉండలేక పోతున్నాం' అని జగ్గారెడ్డి ప్రశ్నించారు. అంతేకాదు, అరుంధతి ఎస్సీ సామాజికవర్గమేనని.. రెడ్డి, బ్రాహ్మణుడు ఎవరైనా అరుంధతి నక్షత్రం చూడాల్సిందేనని చెప్పారు.
కులాల మధ్య, మతాల మధ్య పంచాయితీ ఇప్పుడు కలియుగం వచ్చాక మొదలైందని జగ్గారెడ్డి పేర్కొన్నారు. హనుమంతుడుకి ఉన్న బలం గురించి చెప్పింది జాంబవంతుడేనని.. ఆయన కూడా ఎస్సీ సామాజిక వర్గమేనని అన్నారు.
అలాంటి జాంబవంతుని కూతురు శ్రీకృష్ణుడిని పెళ్లాడిందని జగ్గారెడ్డి పేర్కొన్నారు. ప్రస్తుతం మనంకల్పించుకున్న కలాలు మతాలతోని మనం కొట్లాడుతున్నం.. దీనిని చెరిపేయండ్రి! అని వ్యాఖ్యానించారు.
మహానుభావుడు అంబేద్కర్ విగ్రహం ప్రతి గ్రామంలో ఉండాలని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. అంబేద్కర్ గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్నారు. కష్టాలు, బాధలు, అవమానాలు చూసి అంబేద్కర్ చదువుకు న్నారన్నారు. ఆయన స్ఫూర్తితో ముందుకు సాగాలని జగ్గారెడ్డి సూచించారు. అంటరానితనాన్ని నిర్ములిం చాలంటే విద్య ఒక్కటే మార్గమని తెలిపారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.