Begin typing your search above and press return to search.

ఆ మాట‌లు మ‌న‌సులోంచి వ‌చ్చిన‌వి కావు.. గొల్ల బాబూరావు యూట‌ర్న్‌

By:  Tupaki Desk   |   19 April 2022 4:53 PM GMT
ఆ మాట‌లు మ‌న‌సులోంచి వ‌చ్చిన‌వి కావు.. గొల్ల బాబూరావు యూట‌ర్న్‌
X
ఏపీ అధికార పార్టీ వైసీపీలో మంత్రి ప‌ద‌వులు ద‌క్క‌నివారి అసంతృప్తి ఓ రేంజ్‌లో కొన‌సాగిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో త‌న త‌ఢాకా చూపిస్తానంటూ.. తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించిన విశాఖ జిల్లా రిజ‌ర్వ‌డ్ నియోజ‌క‌వ‌ర్గం పాయ‌క‌రావు పేట ఎమ్మెల్యే గొల్ల‌బాబూరావు.. తాజాగా మ‌రోసారి వైసీపీ అధిష్టానంపై నిప్పులు చెరిగారు. జ‌గ‌న్‌ను దెబ్బ‌కు దెబ్బ కొడ‌తానంటూ తీవ్ర సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ``ద‌మ్ముంటే కాస్కో`` అనే విధంగా హైక‌మాండ్‌కు ఆయ‌న హెచ్చ‌రిక‌లు పంపారు. అంతేకాదు.. అవ‌స‌ర‌మైతే.. త‌న‌ను జైల్లో పెట్టాలంటూ.. వైసీపీ అధిష్టానానికి బాబూరావు స‌వాల్ చేశారు.

అయితే.. ఇంత రెచ్చిపోయిన ఆయ‌న కేవ‌లం 24 గంట‌లు కూడా గ‌డ‌వ‌క‌ముందే.. తుస్సుమ‌న్నారు. వెంట‌నే యూట‌ర్న్ తీసుకున్నారు. అనకాపల్లి జిల్లా కోరుప్రోలులో ఎమ్మెల్యే గొల్ల బాబూరావు నిన్న చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. అధిష్ఠానంపై తనకు ఎలాంటి అసంతృప్తి లేదని తెలిపారు. హింసావాదం అంటే ధర్మాన్ని కోల్పోయిననప్పుడు చేసేదన్నారు. హింసావాదం అంటే అన్యాయం జరిగినప్పుడు ఎదురుతిరగాలన్నారు.

కోటవురట్లలో ఆఫ్ ది రికార్డ్ అన్న మాటలను వక్రీకరించి ప్రచురించారని అన్నారు. మంత్రి పదవిపై ఆవేశంతో అన్న మాటలే అన్నారు. మనసులో నుంచి వచ్చిన మాటలు కాదని వివరణ ఇచ్చారు. 50 ఏళ్ల నుంచి పాయకరావుపేటకు మంత్రి పదవి ప్రాతినిధ్యం లేదన్నారు. తాను ఎప్పటికీ వైఎస్ఆర్‌, జగన్‌కు వీర విధేయుడినేనన్నారు. కార్యకర్తల ఒత్తిడి మేరకే హింసావాదిని అనే పదం వాడా అన్నారు. వేరే ఉద్దేశంతో హింసావాదం అనే పదాన్ని వాడలేదని తెలిపారు. మంత్రి పదవుల విషయంలో అధిష్ఠానంపై అసంతృప్తి లేదని వివరించారు. నియోజకవర్గంలో కొంతమంది నన్ను చిన్నచూపు చూస్తున్నారని వాపోయారు.

ఏం జ‌రిగిందంటే..

త‌న‌కు మంత్రి పదవి దక్కకపోవటంపై గొల్ల బాబూరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. పదవి దక్కకపోవటంతో తనను నమ్ముకున్న అనేక మంది కార్యకర్తలు నష్టపోయారన్నారు. తాను అమాయకుణ్ణి కాదని.., తన హింసావా దం ఏమిటో తర్వలోనే చూపిస్తానని హెచ్చరించారు. పాయ‌క‌రావుపేట నియోజ‌క‌వ‌ర్గంలో కోటవురట్ల మండలంలో జరిగిన వాలంటీర్ల సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. తనకు మంత్రి పదవి దక్కకపోవటంపై తీవ్ర‌ ఆవేదన వ్యక్తం చేశారు.

పదవి దక్కకపోవటంతో తనను నమ్ముకున్న అనేక మంది కార్యకర్తలు నష్టపోయారన్నారు. తాను హింసా వాదిని కాబట్టే జాతీయ కాంగ్రెస్‌కు రాజీనామా చేసి వైసీపీలో చేరాన‌న్నారు. వైసీపీకి, జ‌గ‌న్‌కు దెబ్బకు దెబ్బ కొడతామని.. తన హింసావాదం ఏమిటో త్వరలోనే చూపిస్తానని హెచ్చరించారు. "ఆ బోడి రాజకీ యాలు నాకెందుకయ్యా. ఓ మాట కోసం వైసీపీలో చేరాను. నేను నిజంగా నూటికి లక్ష పర్సెంట్ హింసావా దినే. నేను మీరనుకున్నంత సాఫ్ట్ కాదు. అప్పుడు కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా హింసావాదంతో వైసీపీలో చేరా. బలమైన జాతీయ క్రాంగెస్ పార్టీని కూడా లెక్కచేయలేదు. వీళ్ల కోసం ఇన్ని త్యాగా లు చేస్తే.. నా ప్రజలకు ఏం సమాధానం చెప్పుకోవాలి?`` అని బాబూ రావు వ్యాఖ్యానించారు. అయితే.. తాజాగా త‌న మ‌న‌సులోంచి వ‌చ్చిన మాట‌లు కావ‌ని.. ఆవేశంతో అన్న మాట‌ల‌ని వివ‌ర‌ణ ఇవ్వ‌డం గ‌మ‌నార్హం.

అంతేకాదు.. రాష్ట్రంలో త‌న‌ మీద ఎంతోమందికి ఆశలున్నాయ‌న్న ఆయ‌న ``వాళ్లనుకుంటున్నారేమో (వైసీపీ అధిష్టానం).. నేను అమాయకుడిని కాదు. హింసావాదిని. ఈ మాట లక్ష మంది పబ్లిక్ మీటింగ్‌లో చెబుతా. నాకేం భయం లేదు. కావాలంటే జైళ్లో పెట్టమను." అని బాబూరావు ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ఇప్ప‌టికే ఆయ‌న త‌న అనుచ‌రుల‌తో నాలుగు రోజుల‌కింద‌ట నిర్వ‌హించిన స‌మావేశంలోనూ ఇదే త‌ర‌హా వ్యాఖ్య‌లు చేశారు. ఇప్పుడు మ‌రింత రెచ్చిపోయారు. మ‌రి దీనిపై అధిష్టానం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. ఇప్ప‌టి వ‌ర‌కు అలిగిన వారిని తాడేప‌ల్లికి పిలిచి బుజ్జ‌గించిన అధిష్టానం.. బాబూరావును మాత్రం ప‌ట్టించుకోలేదు. ఈ నేప‌థ్యంలోనే ఆయ‌న మ‌రింత ఆగ్ర‌హంతో ఉన్నారు. మ‌రి ఇప్ప‌టికైనా.. ఈ అసంతృప్తిని త‌గ్గించే చ‌ర్య‌లు తీసుకుంటారేమో చూడాలి.