Begin typing your search above and press return to search.
గోల బాబూరావు... పగవాడికీ వద్దురా ఈ టార్చర్...?
By: Tupaki Desk | 3 Jan 2022 4:30 PM GMTఆయన పడుతున్న అవస్థను చూస్తే బాధేస్తుంది. అయితే ఆయన ఇది స్వయంగా కోరి తెచ్చుకున్నదే అనిపిస్తే మాత్రం రాజకీయమింతే అనిపిస్తుంది. ఇంతకీ ఆ బాధ ఏంటి ఎవరికీ అంటే అధికార వైసీపీ ఎమ్మెల్యేకి, ఆయన ఒకటి రెండూ కాడు, మూడు సార్లు విశాఖ జిల్లా పాయకరావుపేట నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. మంత్రి రేసులో కూడా ఉన్నారు. ఆయన అసలు పేరు గొల్ల బాబూరావు, కానీ ఇపుడు ఆయన పడుతున్న అవస్థ, జరుగుతున్న రభస చూస్తూంటే గోల బాబూరావు అనే సెటైర్లు వేస్తున్నారు.
ఇంతకీ గొల్ల బాబూరావుకు వచ్చిన కష్టమేంటి అంటే చాలానే కధ ఉంది మరి. ఏ రాజకీయ నాయకుడికి అయినా విమర్శలు తప్పవు. అయితే అది ప్రత్యర్ధి పార్టీల నుంచి వస్తాయి. కానీ సొంత పార్టీ నుంచే గొల్ల బాబూరావు పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కొంటున్నారు. అంతేనా ఆయన అవినీతి చేశారని, ఏ పని అయినా లంచం అడుగుతారని కూడా సొంత పార్టీ వారే దండోరా వేసి చెబుతూంటే ఎంతటి గట్టి గుండె ఉన్న ఎమ్మెల్యే అయినా ఎలా తట్టుకోగలరు మరి.
ఇక వైసీపీకి చెందిన సర్పంచులు, ఎంపీటీసీలు, కీలక నేతలు అంతా కూడా ఎస్ రాయవరంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఇక వచ్చిన వారు కూడా వందా రెండు వందలు కానేకాదు, ఏకంగా మూడు వేల మంది ఇలా రోడ్ల మీదకు వచ్చి మాకొద్దీ ఎమ్మెల్యే అంటూ నిరసన తెలియచేస్తే ఎంత వారికైనా కలవరం పుట్టకుండా ఉంటుందా.
ఇక్కడ చిత్రమేంటి అంటే దళితులు కూడా ఈ నిరసనలో భాగం కావడం. తమ సామాజికవర్గానికి చెందిన ఎమ్మెల్యే అయినా కూడా గొల్ల బాబూరావు మీద వారు జెడ్పీటీసీ కాకర దేవి విమర్శలు చేయడం అంటే బాబూరావుకి అంత కంటే ఇబ్బంది వేరేదీ ఉండబోదు అంటున్నారు.
తాము బాబూరావు కోసం పనిచేస్తే ఆయన ప్రతిపక్షాల కొమ్ము కాస్తున్నారని వారికే అందలం అందిస్తున్నారని వీరంతా ద్వజమెత్తారు. అధినాయకత్వం గొల్ల బాబూరావు మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడం విశేషం. మొత్తానికి గొల్ల బాబూరావు మీద ఇంత పెద్ద ఎత్తున వ్యతిరేకత ఉందా అనిపించేలా వేలాది మంది బయటకు వచ్చి ఆయన మీద అంటే షాకింగ్ పరిణామమే. మరి దీని మీద వైసీపీ హై కమాండ్ ఎలా రియాక్ట్ అవుతుంది అన్నది చూడాలి.