Begin typing your search above and press return to search.

ఏపీ డీజీపీపై తెలంగాణ హైకోర్టులో వ్యాజ్యం

By:  Tupaki Desk   |   1 March 2019 11:51 AM IST
ఏపీ డీజీపీపై తెలంగాణ హైకోర్టులో వ్యాజ్యం
X
ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్ హైదరాబాద్ జూబ్లీహిల్స్‌ లోని ప్రశాసన్‌ నగర్ సొసైటీలోని జీహెచ్‌ ఎంసీ పార్కు స్థలాన్ని కబ్జాచేశారని ఏపీకి చెందిన వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి గురువారం హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యా జ్యం దాఖలుచేశారు. ఈ పార్క్‌ ను కబ్జా చేయడమే కాకుండా అక్రమ నిర్మాణాలు చేశారని పిల్‌ లో పేర్కొన్నారు. ఈ పిల్‌ కు సంబంధించి కేసు మంగళవారం విచారణకు వచ్చే అవకాశం ఉంద‌ని స‌మాచారం. ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని డివిజన్‌ బెంచ్‌ ఈ పిల్‌ ను విచారించనుంది.

హైదరాబాద్‌ లోని ప్రశాసన్‌ నగర్‌ లో జీహెచ్‌ ఎంసీ పార్కు స్థలాన్ని ఆక్రమించుకోవడమే కాకుండా అక్రమ నిర్మాణం చేస్తున్నారని ఆరోపిస్తూ వైసీపీకి చెందిన మంగళగిరి శాసనసభ్యుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి పిల్‌ దాఖలు చేశారు. రాష్ట్ర పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి, జీహెచ్‌ ఎంసీ కమిషనర్‌ ఇతర అధికారులతోపాటు ఏపీ డీజీపీ ఆర్‌ పీ ఠాకూర్‌ ను వ్యక్తిగత హౌదాలో ప్రతివాదిగా చేశారు. ``ప్లాట్‌ నెంబర్‌ 149లో 502 చదరపు గజాల స్థలాన్ని ప్రభుత్వం నుంచి ఠాకూర్ పొందారు. 1996లో జీహెచ్‌ ఎంసీ నుంచి జీ ప్లస్‌1కి అనుమతి పొంది జీప్లస్‌ 3 నిర్మించారు. 2008లో అక్రమ నిర్మాణాన్ని క్రమబద్దీకరించుకున్నారు.

2017లో జీహెచ్‌ ఎంసీ పార్కును ఆక్రమించి అక్రమ నిర్మాణానికి తెర తీశారు. ఒకటో అంతస్తు నుంచి మూడో అంతస్తుకు మెటల్‌ ఫ్రేమ్‌ సాయంతో ఓ బ్రిడ్జిగా నిర్మాణం చేస్తున్నారు. పక్కనే ఉన్న రిటైర్డు ఐఏఎస్‌ అధికారి గోయల్‌ ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది. అక్రమ నిర్మాణం గురించి ప్రశాసన్‌ నగర్‌ హౌసింగ్‌ సొసైటీ జీహెచ్‌ ఎంసీ కమిషనర్‌ కు ఫిర్యాదు చేసింది. దీనిపై రాకూర్‌ జీహెచ్‌ ఎంసీకి వివరణ కూడా ఇవ్వలేదు. పార్కు స్థలాన్ని ఆక్రమించుకున్న ఏపీ డీజీపీ నిర్మిస్తున్న వాటిని కూల్చివేయాలి. చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న ఠాకూర్‌ పై చర్యలు తీసుకోవాలి`` అని పిల్‌లో ఆళ్ల తెలంగాణ హైకోర్టును కోరారు.