Begin typing your search above and press return to search.

మండలంకు 50 లక్షల హుకూం జారీ: ప్రకాశం వైసీపీ ఎమ్మెల్యే

By:  Tupaki Desk   |   9 Jun 2020 10:30 AM GMT
మండలంకు 50 లక్షల హుకూం జారీ: ప్రకాశం వైసీపీ ఎమ్మెల్యే
X
ఏపీ సీఎం జగన్ పారదర్శక పాలనకు పెద్దపీట వేస్తున్నారు. అవినీతి రహిత పాలనను కొనసాగిస్తున్నారు. టెండర్లు, సంక్షేమ పథకాలను అర్హులకు చేరేవేందుకు పకడ్బందీగా ముందుకెళ్తున్నారు. జగన్ ప్రభుత్వ పాలన మచ్చ లేకుండా సాగుతుండగా.. కొందరు వైసీపీ ఎమ్మెల్యేల కక్కుర్తి కారణంగా వైసీపీ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

సీఎం రిలీజ్ ఫండ్ విరాళాల వ్యవహారం ఇప్పుడు వైసీపీలో దుమారం రేపుతోంది. సీఎం రిలీఫ్ ఫండ్ కు ప్రజలు విరాళాలు ఇస్తే ఓకే కానీ.. బలవంతంగా వద్దు అని ఏపీ సీఎం జగన్ చెప్పినా కూడా వైసీపీ ఎమ్మెల్యేలు బలవంతం చేసి కేడర్ దగ్గర వసూలు చేస్తున్నారని వైసీపీ కేడర్ వాపోతోంది.

ప్రకాశం జిల్లాలో ఒక ఎమ్మెల్యే సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వాలి అని అతని అనుచరులను ఆరు మందిని కార్ లో తిప్పిస్తున్నాడట.. ప్రతి మండలానికి ఒక 50 లక్షలు ఇవ్వాలి అని ఆ వైసీపీ ఎమ్మెల్యే హుకూం జారీ చేస్తున్నాడని వైసీపీ వర్గాలే వాపోతున్నాయని మండల నాయకులు అంటున్నారు..

సీఎం రిలీఫ్ కు ఇవ్వాలని.. జిల్లాలో అందరి కంటే ఎక్కువ ఇవ్వాలని సదురు ఎమ్మెల్యే కండీషన్ పెడుతున్నాడట.... మీకు పనులు ఇచ్చానని.. ఎంపీటీసీలు ఇచ్చినా.. రేపు సర్పంచ్ లు ఇవ్వాలి అంటే మీరు ఇప్పుడు డబ్బులు ఇవ్వాల్సిందే అని తన ఆరుగురు టీంతో మండలాలకు తిప్పుతూ ఫోన్ లో ఆ ఎమ్మెల్యే తో మాట్లాడిపిస్తూ బెదిరిస్తున్నారు అని వైసీపీ వర్గాలు వాపోతున్నాయి. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమీ సంపాదించలేదు అంటే అది అంత కుదర్దని.. మీరు ఇవ్వాల్సిందేనని హుకూం జారీ చేస్తున్నాడట.. రెండు రోజుల క్రితం ఒక మంత్రి దగ్గరికి వెళ్లి కూడా ఈ సీఎం రిలీఫ్ ఫండ్ విరాళాలపై కొందరు ఫిర్యాదు చేశారు అని సమాచారం. ఆ మంత్రి ఈ సమస్యను సీఎం దగ్గరికి తీసుకొని వెళ్తా అని అని కేడర్ కు చెప్పినట్టు టాక్..