Begin typing your search above and press return to search.

'ఎమ్మెల్యే చెవిరెడ్డి మంచోడు'.. వైసీపీ కీల‌క నేత‌ల స‌ర్టిఫికెట్‌.. రీజ‌నేంటి?

By:  Tupaki Desk   |   11 March 2023 6:00 PM GMT
ఎమ్మెల్యే చెవిరెడ్డి మంచోడు.. వైసీపీ కీల‌క నేత‌ల స‌ర్టిఫికెట్‌.. రీజ‌నేంటి?
X
వైసీపీ ఫైర్‌బ్రాండ్‌గా గుర్తింపు పొందిన చిత్తూరు జిల్లా చంద్ర‌గిరి నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్క‌ర రెడ్డి కోసం.. ఏకంగా న‌లుగురు కీల‌క నాయ‌కులు క‌ద‌ల‌డం.. చెవిరెడ్డి చాలా మంచోడు.. అని ఆయ‌న‌కు వారంతా కూడా స‌ర్టిఫికెట్ ఇవ్వ‌డం జిల్లాలో ఆస‌క్తిగా మారింది. నిజానికి చెవిరెడ్డి గ‌త రెండు ఎన్నిక‌ల్లోనూ గెలుస్తూనే ఉన్నారు. మ‌రి ఆయ‌న‌కు అనూహ్యంగా ఈ స‌ర్టిఫికేష‌న్ ఏంటి? అనేది చ‌ర్చ‌నీయాంశం అయింది.

విష‌యంలోకి వెళ్తే.. టీడీపీ యువ‌నాయ‌కుడు.. నారా లోకేష్ ప్ర‌స్తుతం యువ‌గ‌ళం పాద‌యాత్ర‌లో ఉన్నారు . ఆయ‌న ఏ నియోజ‌క‌వ‌ర్గానికి వెళ్తే.. అక్క‌డ ఎమ్మెల్యేల‌పై విరుచుకుప‌డుతున్నారు. ఈ క్ర‌మంలోనే చం ద్రగిరిలో పాద‌యాత్ర చేసిన స‌మ‌యంలో చెవిరెడ్డిపైనా తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. ఆయ‌న కంపెనీల‌ను కొల్ల‌గొట్టి ఆ సంపాద‌న‌లో ప‌దోవంతు దానం చేసి.. 90 శాతం జేబులో వేసుకుంటున్నార‌ని విమ‌ర్శించారు.

ఈ ప‌రిణామంతో చంద్రగిరిలో చెవిరెడ్డి గ్రాఫ్ అనూహ్యంగా డౌన్ అయింది. వెంట‌నే అప్ర‌మత్త‌మైన చెవి రెడ్డి.. స‌రిదిద్దుకునే ప్ర‌య‌త్నాలు చేశారు. అయితే, చెవిరెడ్డికి పార్టీ అధిష్టానం నుంచి ఆశీస్సులు ఉండ డంతో ఆయ‌న‌కు మ‌ద్ద‌తుగా కీల‌క నేత‌లు న‌లుగురు చేతులు క‌లిపి.. ప్ర‌త్యేకంగా చెవిరెడ్డి మోసేసే కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టార‌న్న‌మాట‌. చంద్రగిరి సమీపంలోని తొండవాడ వద్ద నారా లోకేష్‌కు కౌంట‌ర్ గా స‌భ నిర్వ‌హించారు.

ఈ స‌భ‌కు ఎంపీలు మిథున్ రెడ్డి(రాజంపేట‌), రెడ్డెప్ప‌(చిత్తూరు), ఎమ్మెల్సీ అభ్యర్థి శ్యాం ప్రసాద్ రెడ్డి, మ‌రో కీల‌క స‌ల‌హాదారు హాజ‌రై.. చెవిరెడ్డిని ఆకాశానికి ఎత్తేశారు. రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో జరగని అభివృద్ది చంద్రగిరిలో జరిగిందని తెలిపారు. 430 కోట్ల రూపాయలతో చెవిరెడ్డి చంద్రగిరిని అభివృద్ది చేశార‌ని, త‌న‌ సంపాదనలో 75 శాతం ప్రజలకు ఖర్చు పెడతార‌ని వారు వ్యాఖ్యానించారు.

వైఎస్‌ జగన్‌ అధికారంలో జరిగిన మేలు అంతా గుర్తించాలని సూచించారు కరోనా సమయంలో చెవిరెడ్డి చేసిన సేవలు అమోఘం అన్నారు. టీడీపీ నాయకులకు కూడా ప్ర‌భుత్వ ప‌థ‌కాలు అందుతున్నాయ‌ని వెల్లడించారు.

చెవిరెడ్డి చేస్తున్న సాయం మాకూ చేయాలని త‌మ‌త‌మ‌ నియోజకవర్గ ప్రజలు అడుగుతున్నార‌ని వారు వెల్ల‌డించ‌డం గ‌మ‌నార్హం. సో.. ఇదీ సంగ‌తి.. చెవిరెడ్డి అధిష్టానం మ‌నిషి క‌దా.. ఈగైనా వాల‌నివ్వ‌లేద‌న్న‌మాట‌.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.