Begin typing your search above and press return to search.

మద్యం తరలిస్తూ పట్టుబడిన ఎమ్మెల్యే సోదరుడి కొడుకు

By:  Tupaki Desk   |   24 Aug 2020 6:45 AM GMT
మద్యం తరలిస్తూ పట్టుబడిన ఎమ్మెల్యే సోదరుడి కొడుకు
X
ఏపీలో ఇప్పుడు మద్యం కాసులు కురిపిస్తోంది. మద్యపాన నిషేధం దిశగా ఆలోచిస్తున్న జగన్ సర్కార్ ధరలను భారీగా పెంచడంతో పక్కరాష్ట్రాల నుంచి చీప్ మద్యం అక్రమంగా రవాణా చేస్తూ చాలా మంది కాసులు కురిపించుకుంటున్నారు. ఈ క్రమంలోనే అధికార పార్టీకి చెందిన వారు కూడా ఇందులో బయటపడుతుండడం కలవరం రేపుతోంది.

తాజాగా మద్యం అక్రమ రవాణా కేసులో కర్నూలు జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే సోదరుడి కుమారుడు పట్టుబడిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కర్నూలు నుంచి గోర్లంట్లకు నెంబర్‌ ప్లేట్‌ లేని బైక్‌పై ఓ వ్యక్తి వెళుతుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మద్యం సేవించి ఉన్న ఆ వ్యక్తి తన పేరు మధు అని చెప్పి, తాను ఎమ్మెల్యే సోదరుడి కొడుకునని హల్‌చల్‌ చేశాడు. బైక్‌లో ఉన్న 9 మ్యాక్‌ డోల్‌ విస్కీ క్వార్టర్‌ బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకుని, మధును పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

విషయం తెలుసుకున్న అధికార పార్టీకి చెందిన నాయకులు, సదరు ఎమ్మెల్యే పోలీసులపై ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. ఈ క్రమంలో రాత్రి పొద్దు పోయే వరకు గూడూరు మండలం నాగలాపురం పోలీసులు కేసు నమోదు చేయలేదు. విషయం బయటకు పొక్కడంతో చేసేది లేక ఎక్సైజ్‌ చట్టం కింద కేసు నమోదు చేశారు.