Begin typing your search above and press return to search.

కార్పొరేష‌న్ ప‌ద‌వులు అయితే.. పొందాం.. కానీ.. మాకు ప్రాధాన్యం ఏదీ?

By:  Tupaki Desk   |   12 Aug 2021 11:30 PM GMT
కార్పొరేష‌న్ ప‌ద‌వులు అయితే.. పొందాం.. కానీ.. మాకు ప్రాధాన్యం ఏదీ?
X
వైసీపీ అధినేత‌, ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ నిర్ణ‌యంతో ఇప్ప‌టికే ఆ పార్టీ నాయ‌కులు, ఎమ్మెల్యేలు.. ఉసూరు మంటున్నారు. ``మా పార్టీ అధికారంలోకి వ‌చ్చినా.. మాకు ఒన‌గూరిన ప్ర‌యోజ‌నం ఏంట‌``ని వారు ప్ర‌శ్నిస్తు న్నారు. దీనికి కార‌ణం.. ఎమ్మెల్యేల‌కు ఇప్పుడు అధికారాలు లేవు. వారికి నిధుల కేటాయింపు కూడా లేదు. ఏదో ఉన్నారంటే.. ఉన్నారు.. అసెంబ్లీ స‌మావేశాల‌కు వెళ్లిన‌ప్పుడు క‌ప్పు కాఫీ తాగి రావ‌డం త‌ప్ప‌.. త‌మ‌కు స్వేచ్ఛ కూడా లేకుండా పోయింద‌ని అంటున్నారు. దీనికి ప్ర‌ధానంగా.. స‌మ‌స్య‌లు చెబితే.. జ‌గ‌న్ ప్ర‌భుత్వం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని.. సొంత పార్టీ నేత‌లే విమ‌ర్శించిన‌ట్టు అవుతుంది.

అలాగ‌ని నియోజ‌క‌వ‌ర్గాల‌ను పట్టించుకోక‌పోతే.. మొద‌టికే మోసం వ‌స్తుంది. ఈ ప‌రిణామాల‌తోనే.. ఎమ్మెల్యే లు చాలా వ‌ర‌కు మౌనంగా ఉంటున్నారు. పైగా నిధుల విష‌యాన్ని అస‌లే అడ‌గడం లేదు. ఇప్పుడు ఇదే స‌మ‌స్య‌.. వైసీపీ స‌ర్కారు, ముఖ్యంగా జ‌గ‌న్‌..ప్ర‌తిష్టాత్మ‌కంగా భావిస్తున్న కార్పొరేష‌న్ల విష‌యంలోనూ ఎదుర‌వుతోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఒక‌టి.. కార్పొరేష‌న్ల వ‌ల్ల‌.. త‌మ‌కు ప్ర‌యోజ‌నం లేద‌ని.. ఆయా సామాజిక వ‌ర్గాల‌కు చెందిన వారు.. అంటున్నారు.

ఇక‌, కార్పొరేష‌న్ ప‌ద‌వులు అయితే.. పొందాం.. కానీ.. మాకు ప్రాధాన్యం ఏదీ? అని వైసీపీ నాయ‌కులు అంటున్నారు. దీంతో జ‌గ‌న్ స‌ర్కారు ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా భావిస్తున్న కార్పొరేష‌న్లు.. కొర‌గాకుంటా పోతున్నాయ‌నే వాద‌న వినిపిస్తోంది. ప్ర‌స్తుతం కాపు, బ్రాహ్మ‌ణ‌, మైనార్టీ వంటి కీల‌క సామాజిక వ‌ర్గాల‌కు చెందిన కార్పొరేష‌న్లు ఉన్నా.. మ‌రో 59 కార్పొరేష‌న్ల‌ను ఏర్పాటు చేశారు. వీటిలో చిన్నా చిత‌కా సామాజిక వ‌ర్గాల‌కు చెందిన వారిని చేర్చి. వారికి కార్పొరేష‌న్లు ఏర్పాటు చేశారు.

మొద‌ట్లో వీటిపై చాలానే ఆశ‌లు ఉన్నాయి. ఎందుకంటే.. ఇప్ప‌టి వ‌ర‌కు త‌మ‌కు ల‌భించ‌ని గుర్తింపును జ‌గ‌న్ సాకారం చేశార‌ని.. వారు మురిసిపోయారు. అస‌లు త‌మ‌కు ఎలాంటి ప్రాధాన్యం ద‌క్కుతుంది.. అని త‌ల ప‌ట్టుకున్న వారికి కూడా కార్పొరేష‌న్ల ఏర్పాటుతో ఉప‌శ‌మ‌నం ల‌భించిన‌ట్ట‌యింది. అయితే.. ఈ ఆనందం.. అత్యంత వేగంగా ఆవిరి అయింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఎందుకంటే.. ఇప్పుడు ఏ కార్పొరేష‌న్ చైర్మ‌న్‌ను ప‌ల‌క‌రించినా.. త‌మ‌కు ప్రాధాన్యం లేకుండా పోయింద‌నే వాద‌న వినిపిస్తోంది.

అంతేకాదు.. కార్పొరేషన్ నిధుల‌ను ఖ‌ర్చు చేసే.. అధికారం కూడా త‌మ‌కు లేద‌ని.. అంతా అధికారులే మేనేజ్ చేసుకుంటున్నార‌ని.కేవ‌లం తాము.. సంత‌కాల‌కే ప‌రిమితం అవుతున్నామ‌ని.. చెబుతున్నారు. తాజాగా చేప‌ట్టిన ఓ ప‌థ‌కానికి అన్ని కార్పొరేష‌న్ల నుంచి నిధుల‌ను మ‌ళ్లించ‌డంతో.. త‌మ వ‌ద్ద పైసా కూడా లేద‌ని.. ఇక‌, దీంతో సామాజిక వ‌ర్గాల వారికి ఎలాంటి న్యాయం చేస్తామని అంటున్నారు. ఈ నేప‌థ్యంలో అటు ఎమ్మెల్యేల మాదిరిగానే ఇటు కార్పొరేష‌న్ సార‌థులు కూడా ఇబ్బందులు ప‌డుతున్నార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.