Begin typing your search above and press return to search.
రోజువారీగా ఎమ్మెల్యేల ఎర ఎపిసోడ్.. సంకేతాలు ఇచ్చిన కేసీఆర్
By: Tupaki Desk | 4 Nov 2022 6:30 AM GMTఏ మాటకు ఆ మాటే చెప్పాలి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మాటలకు చేతలకు కొన్ని సందర్భాల్లో అస్సలు పొంతన ఉండదన్నది మర్చిపోకూడదు. తాను చెప్పిన మాటల్ని తానే ఫాలో కాని విచిత్రం ఆయనలో తరచూ కనిపిస్తూ ఉంటుంది.
తాజాగా ఎమ్మెల్యేలకు ఎర వేసిన ఎపిసోడ్ కు సంబంధించిన సంచలన ప్రెస్ మీట్ పెట్టిన ఆయన.. గంటకు పైనే నాన్ స్టాప్ గా మాట్లాడిన కేసీఆర్.. విలేకరులు ప్రశ్నలు వేసే సమయానికి మాత్రం.. ఇప్పటికే ఆలస్యమైంది.. దీనిపై రేపు మళ్లీ ప్రెస్ మీట్ పెడతా.. ముందు మీరెళ్లి.. వీడియోలోని అంశాల్ని విశ్లేషించండని చెప్పటం తెలిసిందే.
ఎమ్మెల్యేల ఎర ఎపిసోడ్ ను కొద్ది రోజుల పాటు కంటిన్యూ చేయాలని.. తరచూ ప్రెస్ మీట్ పెట్టేందుకు సీఎం కేసీఆర్ సిద్ధంగా ఉన్నట్లు చెబుతున్నారు. కేంద్రంలోని మోడీ సర్కారు మీద ఒత్తిడి తెచ్చేందుకు.. పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్లు విడుదలైన వేళలో.. ఇంతకు మించిన సరైన సమయం ఉండదన్న వాదన వినిపిస్తోంది. మోడీషాలకు చుక్కలు చూపించే అవకాశం తనకు లభించినప్పపుడు.. దాన్ని ఎందుకు మిస్ చేసుకోవాలన్నట్లుగా సీఎం కేసీఆర్ ప్లానింగ్ ఉందన్న మాట వినిపిస్తోంది.
అయితే.. ఇక్కడ కేసీఆర్ గురించి ఒక విషయాన్ని ప్రస్తావించాలి. కొన్ని సందర్భాల్లో ఎంతో పట్టుదలను మాటల్లో ప్రదర్శించే ఆయన.. ఉన్నట్లుండి.. ఆయా విషయాల్ని ఇట్టే వదిలేస్తుంటారు. ఆయన మాటలు చూసినప్పుడు ఏదో జరిగిపోతుందన్నట్లుగా ఉంటుంది.
తీరా చూస్తే.. ఆ తర్వాత కామ్ గా ఉండే వైఖరి కొన్నిసార్లు కనిపిస్తుందని చెబుతారు. తాజా ఎపిసోడ్ లో ఆయనేం చేస్తారో చూడాలంటున్నారు.'ఎమ్మెల్యేలకు ఎర' ఎపిసోడ్ కు సంబంధించి ఒకట్రెండు ప్రెస్ మీట్లు వరుసగా ఉండే వీలుంటుందని.. అంతకు మించి ఎక్కువగా ఉండే అవకాశం ఉండదంటున్నారు.
అయితే.. ఇదంతా కూడా తానువిడుదల చేసిన వీడియోలపై ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు.. న్యాయవ్యవస్థ.. ఇతర పార్టీల అధినేతలు రియాక్టు అయ్యే దానికి తగ్గట్లు ఉంటుందని చెబుతున్నారు. ఏమైనా.. ఎమ్మెల్యేలకు ఎర ఎపిసోడ్ ను డైలీ బేసిస్ లో కొనసాగించాలని సీఎం కేసీఆర్ అనుకున్నప్పటికీ.. ఆచరణలో అంత తేలిక కాదన్న మాట వినిపిస్తోంది. మరేం జరుగుతుందో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.