Begin typing your search above and press return to search.

వైసీపీ చేరిక‌ల్లో అప‌శృతి.. ఎమ్మెల్యే కంటికి తీవ్ర గాయం!

By:  Tupaki Desk   |   11 July 2021 3:30 PM GMT
వైసీపీ చేరిక‌ల్లో అప‌శృతి.. ఎమ్మెల్యే కంటికి తీవ్ర గాయం!
X
త‌మ పార్టీలో ఇత‌ర పార్టీల‌కు చెందిన వారు వ‌చ్చి చేరిన‌ప్పుడు ఆ జోష్ ఎలా ఉంటుందో కార్య‌క‌ర్త‌ల‌కు మాత్ర‌మే తెలుసు. త‌మ బ‌లం అమాంతం పెరిగిపోయిన‌ట్టుగా భావిస్తారు. ఈల వేసి గోల చేస్తారు సంబ‌రాలు చేసుకుంటారు. విశాఖ జిల్లాలో వైసీపీ శ్రేణులు కూడా ఇదేవిధంగా సెల‌బ్రేట్ చేసుకున్నారు. అయితే.. ఈ వేడుక‌ల్లో అప‌శృతి చోటు చేసుకుంది. వైసీపీ పాయకరావుపేట ఎమ్మెల్యే బాబూరావు కంటికి తీవ్ర‌ గాయ‌మైంది.

విశాఖ జిల్లా పాయ‌క‌రావు పేట‌లో వివిధ పార్టీల‌కు చెందిన ప‌లువురు నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సంద‌ర్భంగా భారీ కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. ఉత్సాహం ఉర‌కలెత్తిన వైఎస్సార్ సీపీ కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌లు ఆ కార్య‌క్ర‌మంలో బాణ సంచా కాల్చారు. అయితే.. ఆ స‌మ‌యంలో ఎమ్మెల్యే ద‌గ్గ‌రా ఉండ‌డంతో.. నిప్పు ర‌వ్వులు ఎగ‌సి ఎమ్మెల్యే కంట్లో ప‌డ్డాయి.

దీంతో.. ఎమ్మెల్యే కంటికి తీవ్ర‌గాయ‌మైంది. స్పందించిన కార్య‌క‌ర్త‌లు వెంట‌నే ఆయ‌న్ను విశాఖ ఆసుప‌త్రికి త‌ర‌లించారు. గాయం తీవ్రంగానే అయిన‌ట్టుగా చెబుతున్నారు. ప్ర‌స్తుతం వైద్యులు ఆయ‌న‌కు చికిత్స అందిస్తున్నారు. విష‌యం తెలుసుకున్న నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు పెద్ద ఎత్తున ఆసుప‌త్రికి చేరుకుంటున్నారు.