Begin typing your search above and press return to search.
సాయిరెడ్డి ఫోన్.. కట్ చేసిన ఎమ్మెల్యే.. ఎందుకు? ఏం జరిగింది?
By: Tupaki Desk | 17 Sep 2021 1:30 AM GMTవైసీపీ కీలక నాయకుడు, ముఖ్యమంత్రి జగన్ తర్వాత.. ఆ రేంజ్‌లో చక్రం తిప్పుతున్న నాయకుల్లో ఒకరుగా గుర్తింపు ఉన్న ఎంపీ.. విజయసాయిరెడ్డి. అలాంటి నాయకుడి నుంచి ఫోన్ వస్తే.. చాలు అనుకునే వారు చాలా మంది ఉన్నారు. కనీసం అప్పుడైనా.. తమ సమస్యలు చెప్పుకునేందుకు అవకాశం చిక్కుతుందని అనుకునేవారు కోకొల్లలుగా ఉన్నారు. మరి అలాంటి సాయిరెడ్డి ఏరికోరి ఫోన్ చేస్తే.. ఒక ఎమ్మెల్యే ఫోన్ కట్ చేశారు? నువ్వు వద్దు.. నీ ఫోను వద్దు.. అంటూ.. కట్ చేసి.. మరీ చెప్పా పెట్టకుండా.. అజ్ఞాతంలోకి వెళ్లారు? మరి ఆయన ఎవరు? ఏం జరిగింది? ఇదీ ఇప్పుడు వైసీపీలో హాట్ టాపిక్.
విశాఖ జిల్లా పాయకరావుపేట ఎస్సీ నియోజకవర్గంలో కీలక నాయకుడు, వైఎస్ హయాం నుంచి చక్రం తిప్పుతున్న సీనియర్ నేత గొల్ల బాబూరావు. తన సీనియార్టీకి తనకు మంత్రి పదవి దక్కకపోతుందా? అని ఎదురు చూస్తున్న వారిలో గొల్ల బాబూరావు కీలక పొజిషన్‌లో ఉన్నారు. అంతేకాదు.. త్వరలోనే ప్రక్షాళన జరగనున్న మంత్రి వర్గంలో తనకు సీటు, చోటు ఖాయమని ఆయన ఆశలు పెట్టుకున్నారు. కానీ, ఇంతలోనే పెద్ద వార్త ఆయన చెవిలో పడింది. అంతే! ఆయన ఒక్కసారిగా ఖంగు తిన్నారు. వెంటనే అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.
రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ప్రకటించిన టీటీడీ పాలకమండలి సభ్యుల జాబితాలో ఎమ్మెల్యే గొల్ల బాబూరావు పేరు కూడా వుంది. అయితే రెండేళ్ల కిందట టీటీడీ బోర్డును నియమించినప్పుడు సభ్యునిగా బాబూరావు పేరు వినిపించింది. ఏ కారణం చేతనోగానీ ఆయనకు బదులు ఎలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబురాజును ఎంపిక చేశారు. అప్పట్లో నిరాశ చెందిన ఆయనకు ఈ పర్యాయం అధిష్ఠానం అవకాశం కల్పించి టీటీడీ బోర్డుసభ్యుడిగా నియమించింది. కాగా సీఎంగా జగన్ పదవీ ప్రమాణ స్వీకారం చేసిన రోజు... రెండున్నర ఏళ్ల తర్వాత మంత్రులందరినీ మార్చుతానని ప్రకటించడం, త్వరలో మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ వుంటుందని ఊహాగానాలు వెలువడుతుండడంతో గొల్ల బాబురావు మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నారు.
ఈ నేపథ్యంలో టీటీడీ బోర్డు సభ్యునిగా నియమించడం అంటే మంత్రి పదవి లేదని పరోక్షంగా చెప్పిన ట్టేనని భావించిన ఆయన తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఇదే విషయాన్ని తన సన్నిహితులకు చెప్పి ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఈ విషయం తెలుసుకున్న ఏంపీ విజయసాయిరెడ్డి స్వయంగా బాబూరావుకు ఫోన్ చేయగా... ''నాకు టీటీడీ పదవి అవసరం లేదు'' అని ఫోన్ కట్ చేసి, అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.
వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం తరువాత కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి, వైసీపీ వెంట నడిచిన అతికొద్దిమందిలో తాను ఒకడినని, దళితుడిని కాబట్టే తనను చిన్నచూపు చూస్తున్నారని సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలిసింది. అప్పట్లో వైసీపీని తీవ్రదుర్భాషలాడిన వారికి వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత మంత్రి పదవులు కట్టబెట్టారని, తనను మాత్రం పక్కన పెట్టారని వాపోయినట్టు తెలిసింది. అయితే.. ఈ విషయంలో ఆయన నుంచి సరైన క్లారిటీ లేక పోవడంతో.. వైసీపీ నేతలు తర్జన భర్జన పడుతున్నారు. మరి చివరకు ఇది ఎటు మలుపు తిరుగుతుందో చూడాలి.