Begin typing your search above and press return to search.

ఆ అధికారిని చెడామ‌డా తిట్టేసిన బాబూమోహ‌న్‌

By:  Tupaki Desk   |   25 Oct 2017 5:50 AM GMT
ఆ అధికారిని చెడామ‌డా తిట్టేసిన బాబూమోహ‌న్‌
X
చెప్పిన ప‌ని చేయ‌టం లేదంటూ ప్ర‌ముఖ సినీన‌టుడు క‌మ్ తెలంగాణ అధికార పార్టీ ఎమ్మెల్యే బాబూ మోహ‌న్ తీవ్ర ఆగ్ర‌హానికి గుర‌య్యారు. రెండేళ్లుగా తాను చెబుతున్న ప‌నిని చేయ‌ని త‌హ‌సీల్దార్ పై ఆయ‌న ఫైర్ అయ్యారు. పాలిటెక్నిక్ క‌ళాశాల‌కు దారి లేద‌ని రెండేళ్లు చెబుతున్నాన‌ని.. అయిన‌ప్ప‌టికీ ఆ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించ‌ని అధికారిపై తీవ్ర ఆగ్ర‌హాన్ని ప్ర‌ద‌ర్శించారు.

ఎల్లుండి హోం మంత్రి.. త‌ర్వాతి రోజున డిప్యూటీ సీఎం వ‌స్తుంటే.. రోడ్డు సంగ‌తి చూడాలంటూ ఓ వీఆర్వీను పంపుతావా? ఏమ‌నుకుంటున్నావ్‌?.. నువ్వెంత‌.. నీ ఉద్యోగం ఎంత‌? అంటూ తీవ్ర ఆగ్ర‌హాన్ని ప్ర‌ద‌ర్శించారు. పుల్ క‌ల్ మండ‌లంలోని శివంపేట వ‌ద్ద ప్ర‌భుత్వ సాధార‌ణ పాలిటెక్నిక్ కాలేజీకి రోడ్డు ఏర్పాటుకు స‌ర్వే చేయాల్సి ఉంది.

దీనిపై పుల్ క‌ల్ త‌హ‌సీల్దార్‌కు బాబుమోహ‌న్ ప‌లుమార్లు చెప్పారు. అయిన‌ప్ప‌టికీ అధికారులు స్పందించ‌క‌పోవ‌టంతో తాజాగా ఆయ‌న ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేశారు.

ఈ నెల 20 నుంచి నియోజ‌క‌వ‌ర్గంలోని ప‌లు చోట్ల అభివృద్ధి కార్య‌క్ర‌మాలు చేప‌డుతున్న బాబూమోహ‌న్‌.. రోడ్డు విష‌య‌మైన పుల్ క‌ల్ త‌హ‌సీల్దార్ స‌మ్మ‌య్య‌కు ఫోన్ చేశారు. ఈ సంద‌ర్భంగా ఆగ్ర‌హానికి గురైన ఆందోల్ ఎమ్మెల్యే బాబూమోహ‌న్‌.. ఏమ‌నుకుంటున్నావ‌య్యా.. నువ్వెంత‌? నీ ఉద్యోగ‌మెంత‌? రోడ్డు విష‌య‌మై డిప్యూటీ సీఎంకు ఏం చెప్పాలి? నిన్ను స‌స్పెండ్ చేయ‌మ‌ని చెప్పాలా? అంటూ తీవ్ర స్వ‌రంతో మంద‌లించారు.

తాను టేక్మల్ నుంచి వ‌స్తున్నాన‌ని.. త‌హ‌సీల్దార్ పాలిటెక్నిక్ కాలేజీ రోడ్డు మీద ఉండాలంటూ ఆదేశించిన తీరు ఇప్పుడు ఉద్యోగ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.