Begin typing your search above and press return to search.

అవంతిని అవాక్కు అయ్యేలా చేశారు...?

By:  Tupaki Desk   |   26 April 2022 1:30 PM GMT
అవంతిని అవాక్కు అయ్యేలా చేశారు...?
X
ఆయన మంత్రి పదవిని మూడేళ్ల పాటు నిర్వహించిన నాయకుడు. గత దశాబ్దన్నరగా రాజకీయాల్లో ఉన్నారు. ఓటమి ఎరుగని నేతగా పేరు తెచ్చుకున్నారు. ఆయన మలివిడత విస్తరణలో మంత్రి పదవిని ఆశించారు. అయితే జగన్ మాత్రం పక్కన పెట్టారు. ఎలాగంటే విశాఖకు ఒక్క మంత్రి పదవీ ఇవ్వకుండా అనకాపల్లికి మాత్రం రెండు పదవులు ఇచ్చేశారు.

దాంతో అలిగిన అవంతికి సీఎం జగన్ స్వయంగా బుజ్జగించారు. ఆయన విశాఖ టూర్ లో అవంతికి పిలిచి మరీ మంచి భవిష్యత్తుకు పార్టీకి ఉందని, అందువల్ల పార్టీ ప్రెసిడెంట్ పదవి ఇస్తున్నామని చెప్పారు. అలా విశాఖ జిల్లా వైసీపీ ప్రెసిడెంట్ గా అవంతిని నియమించారు.

ఇదిలా ఉంటే చాలా ఆర్భాటంగా జిల్లా వైసీపీ ప్రెసిడెంట్ పీఠాన్ని అధిరోహించాలని అవంతి ఉబలాటపడ్డారు. విశాఖ జిల్లాలో మొత్తానికి మొత్తం పదవులు వైసీపీవే. ఇక నామినేటెడ్ పదవులు కూడా ఆ పార్టీవే. అలాగే జీవీఎంసీ లో అరవై మంది దాకా కార్పోరేటర్లు వైసీపీ వారే ఉన్నారు.

కానీ అవంతి పదవీ బాధ్యతల వేళ మెజారిటీ నేతలు, కార్పోరేటర్లు డుమ్మా కొట్టారు. రేపటి రోజున విశాఖ జిల్లాలో ఆరు సీట్లను గెలిపించాలీ అంటే కార్పోరేటర్లు, నామినేటెడ్ పదవులు అందుకున్న వారి సహకారం అవసరం. అలా ద్వితీయ శ్రేణి నాయకులతో పాటు, కీలక నేతలు కూడా అవంతి ప్రమాణానికి డుమ్మా కొట్టడంతో ఆదిలోనే అవంతికి చుక్కలు చూపించారా అన్న భావన అయితే కలుగుతోంది. మరి ఎందుకు వారు డుమ్మా కొట్టారో చూడాలి.

ఇక విశాఖ జిల్లాలో బలంగా టీడీపీ ఈ రోజుకీ ఉంది. దాంతో ఆ పార్టీని ఢీ కొట్టడం అంటే అంత ఈజీగా కాదు, సొంత పార్టీలోనే నేతల సహకారం అంతంతమాత్రంగా ఉన్న వేళ అవంతి వాటిని ఎలా అధిగమించి ముందుకు సాగుతారో, ఫ్యాన్ పార్టీని విశాఖ జిల్లాలో ఎలా గిర్రున తిప్పుతారో చూడాల్సిందే.