Begin typing your search above and press return to search.

ఆనం నోటి నుంచి 'ముంద‌స్తు' మాట‌.. ఏపీలో ఏం జ‌రుగుతోంది...!

By:  Tupaki Desk   |   22 Feb 2023 1:41 PM GMT
ఆనం నోటి నుంచి ముంద‌స్తు మాట‌.. ఏపీలో ఏం జ‌రుగుతోంది...!
X
ఏపీలో ముంద‌స్తు ఎన్నిక‌లు జ‌రుగుతాయా? జ‌ర‌గ‌వా? ఈ చ‌ర్చ కొన్నాళ్లుగా జ‌రుగుతూనే ఉంది. ముఖ్యంగా టీడీపీ శిబిరంలో ఈ విష‌యంపై పెద్ద ఎత్తున చ‌ర్చ‌సాగుతూనే ఉంది. అయితే.. దీనిపై వైసీపీ నాయ‌కులు పెద‌వి విప్ప‌డం లేదు. మ‌రోవైపు టీడీపీ అదినేత చంద్ర‌బాబు మాత్రం ముంద‌స్తు ఖాయ‌మ‌ని చెబుతున్నారు. ఇక‌, ఇటీవ‌ల కొంద‌రు వైసీపీ నాయ‌కులు కూడా ఇదే పాట పాడుతున్నారు. అయితే..ఎవ‌రూకూడా బ‌య‌ట‌కు చెప్పడం లేదు. దీంతో అస‌లు ముంద‌స్తు ఉంటుందా? ఉండ‌దా? అనేది ఆస‌క్తిగా మారింది.

ఇక‌, తాజాగా వైసీపీ రెబ‌ల్ ఎమ్మెల్యే ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రంలో మార్చి 15 త‌ర్వాత ఎప్పుడైనా ఎన్నిక‌లు రావొచ్చ‌ని చెప్పారు. న‌వంబ‌రులో గా అసెంబ్లీ ర‌ద్దు చేయాల‌నే సూచ‌న‌లు ఉన్నాయ‌ని..తన‌కుఅత్యంత స‌న్నిహితులైన తాడేప‌ల్లి వ‌ర్గాల వారు చెప్పార‌ని ఆయ‌న బాంబు పేల్చ‌డం గ‌మ‌నార్హం.

దీనికి కొన్ని రీజ‌న్లు కూడా చెప్పుకొచ్చా రు. ప్ర‌స్తుతం నారా లోకేష్ యువ‌గ‌ళం పాద‌యాత్ర దూకుడుగా ఉంద‌ని.. ఇది ప్ర‌జ‌ల్లోకి వెళ్ల‌డానికి ముందే.. ఎన్నిక‌లకు వెళ్లిపోవాల‌ని భావిస్తున్న‌ట్టు చెప్పారు.

అదేస‌మ‌యంలో వారాహి యాత్ర‌ను ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్రారంభిస్తే.. ఇక‌, త‌మ‌కు ఇబ్బందులు త‌ప్ప‌వ‌ని వైసీపీ అధినేత అంచ‌నా వేస్తున్నార‌ని.. త‌న‌కు ప‌క్కా స‌మాచారం ఉంద‌ని ఆనం చెప్ప‌డం విశేషం.

ఈ రెండు యాత్ర‌ల ప్ర‌భావం సార్వ‌త్రిక స‌మ‌రంపై ఎక్కువ‌గానే ఉంటుంద‌ని.. అందుకే.. ముందస్తు ఎన్నిక‌ల‌కు వెళ్లే ప్ర‌య‌త్నాల‌ను కొట్టిపారేయ‌లేన‌న్నారు. ఇక‌, మార్చి 15లోగా బ‌డ్జెట్ ప్ర‌వేశ పెట్ట‌నున్న‌ట్టు తెలిసింద‌న్నారు. ఇది స్వ‌ల్పకాలిక బ‌డ్జెట్గానే ఉంటుంద‌న్నారు. ఏదేమైనా మార్చి 15 త‌ర్వాత రాష్ట్రంలో ఎన్నిక‌ల‌కు ఛాన్స్ ఉంద‌ని ఆనం చెప్పుకొచ్చారు.

ఆత్మ‌కూరుపైనే తాను దృష్టి పెట్టిన‌ట్టు ఆనం చెప్ప‌డం గ‌మ‌నార్హం. ప్ర‌స్తుతం ఆయ‌న వెంక‌ట‌గిరి నియోజ‌క‌వ‌ర్గం నుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. అయితే.. త్వ‌ర‌లోనే ఆనం టీడీపీ తీర్థం పుచ్చుకుంటార‌ని తెలుస్తోంది. దీనికి సంబందించి కూడా ఏర్పాట్లు పూర్త‌య్యాయి. ఆయ‌న ఇప్ప‌టికే త‌న ప‌రివారంతో చ‌ర్చలు కూడా పూర్తి చేశారు.

అయితే.. ఆత్మ‌కూరులో మేక‌పాటి వ‌ర్గాన్ని కాద‌ని.. ఆనంకు ప్ర‌జ‌లు ప‌ట్టం క‌డ‌తారా? అనేది ఆస‌క్తిగా మారింది. ఒక‌వేళ అలా కాకున్నా.. పోటీ మాత్రం భీకరంగా ఉంటుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి అటు ముంద‌స్తు.. ఇటు ఆనం వ్యూహం ఏమేర‌కు ఫలిస్తుందో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.