Begin typing your search above and press return to search.

నిజాయితీ మార్కెట్.. వ్యాపారులు ఉండరు.. బేరాలుండవ్

By:  Tupaki Desk   |   2 Dec 2020 11:30 PM GMT
నిజాయితీ మార్కెట్.. వ్యాపారులు ఉండరు.. బేరాలుండవ్
X
మిజోరాం రాష్ట్రంలో జరిగే ఓ సంత మనుషుల్లో ఇంకా మంచి, నిజాయితీ, మానవత్వం బతికే ఉన్నాయని చాటుతోంది. అక్కడ ఓ సంత వ్యాపారులు, దళారులు లేకుండానే సాగుతోంది. అక్కడ తూకాలు వేసే బేరాలు ఆడే వ్యాపారులు కనిపించారు. మార్కెట్ నిండా కావాల్సిన తాజా కూరగాయలు, చేపలు ఉంటాయి. షాపింగ్ కి వెళ్ళిన వారు తమకు నచ్చిన వస్తువును తీసుకొని.. వాళ్ల తూకం వేసుకొని అక్కడి మనీ బాక్స్ లో డబ్బు వేసి వెళుతుంటారు.అదేంటి వ్యాపారులు లేకుంటే.. దొంగతనం జరిగే అవకాశం ఉంటుంది కదా.. మనకు నచ్చిన వస్తువులు తీసుకుని డబ్బులు ఇవ్వకుండా వెళ్లొచ్చు కదా.. అనే సందేహం రావచ్చు. నిజమే కానీ ఇక్కడ ఎవరు అలాంటి పనులకు పాల్పడ్డారు. నమ్మకానికి చిరునామా ఈ నిజాయితీ మార్కెట్. ఇప్పటివరకు ఎవరూ రైతులు, వ్యాపారులు నష్టపోయింది లేదు. ఈ మార్కెట్ మనుషుల్లో నిజాయితీ, నమ్మకం ఇంకా సజీవంగా ఉన్నాయని చాటుతోంది.

మిజోరాం రాష్ట్రంలోని ఐజ్వాల్ కు 65 కిలోమీటర్ల దూరంలో ఉన్న సీలింగ్ లో ఈ వింతైన, ఆదర్శవంతమైన సంత కొన్నేళ్ల నుంచి కొనసాగుతోంది. రైతులు తాము పండించిన కూరగాయలను మార్కెట్ కు తీసుకువచ్చి ఏర్పాటు చేసిన టేబుళ్ల పైన, వెదురు బుట్టల్లో ఉంచి వెళతారు. కూరగాయల పక్కనే ఆయా వస్తువుల ధర తెలిపే పట్టిక పెడతారు. దాని పక్కనే ఓ మనీ బాక్స్ ఉంచుతారు. కొనుగోలుదారులు అక్కడి తాజా కూరగాయలు, పూలు, చేపలు ఇతర సరుకులు తామే తూకం వేసుకొని అందుకు అయిన మొత్తాన్ని అక్కడి మనీ బాక్స్ లో వేస్తారు.

కాస్త ఏమరుపాటుగా ఉంటే దుకాణాల్లో చోరీ జరిగే ఈ రోజుల్లో ఇంత నిజాయితీగా మార్కెట్ నడుస్తుండడం ఆశ్చర్యకరమే. దుకాణాల్లో వ్యాపారులు సీసీ కెమెరాలు పెట్టుకుని మరి ఏ వస్తువు దొంగతనం కాకుండా పరిశీలిస్తూ ఉంటారు. ఈ మార్కెట్లో ఆ పరిస్థితి లేదు. నిజాయితీ ఆధారంగా కొన్నేళ్ల నుంచి ఈ సొంత అక్కడ జరుగుతూ వస్తోంది.

ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే అక్కడికి కూరగాయలు తెచ్చి సంతలో పెట్టి వెళ్ళే రైతులు జనం వల్ల ఎప్పుడు మోసపోయింది లేదట. మనుషులపై ఒకరిపై మరొకరికి ఇంత నమ్మకం ఉండడం వల్లే ఈ సంత ఇప్పటికీ నిర్వహిస్తున్నారు. ఆ నిజాయితీ మార్కెట్ ఇప్పుడు ఒక పర్యాటక ప్రదేశం గా మారింది. అలాంటి సంతను ఒక్కసారైనా చూడాలని అక్కడికి వచ్చే పర్యాటకులు కూడా ఎక్కువగానే ఉంటారు. ఆ సంత నిజాయితీని బతికించడమే కాదు. పర్యాటకానికి చిరునామాగా కూడా మారిపోయింది.