Begin typing your search above and press return to search.

మిథాలీరాజ్ తోలి భారత క్రికెటర్‌గా రికార్డ్ !

By:  Tupaki Desk   |   12 March 2021 11:30 AM GMT
మిథాలీరాజ్ తోలి భారత క్రికెటర్‌గా రికార్డ్ !
X
మహిళల క్రికెట్ ‌లో భారత దిగ్గజ బ్యాట్స్‌ వుమెన్ మిథాలీ రాజ్ అరుదైన ఘనత సాధించింది. లక్నో వేదికగా దక్షిణాఫ్రికా ఉమెన్స్ టీమ్ ‌తో ఈరోజు జరిగిన మూడో వన్డే మ్యాచ్‌ లో 50 బంతుల్లో 5x4 సాయంతో 36 పరుగులు చేసిన మిథాలీరాజ్, ఇంటర్నేషనల్ కెరీర్ ‌లో 10,000 పరుగుల మార్క్‌ ని అందుకుంది. మహిళల క్రికెట్‌లో ఇప్పటి వరకూ ఇంగ్లాండ్ బ్యాట్స్ ‌వుమెన్ కార్లెట్ ఎడ్వర్డ్స్ మాత్రమే ఈ ఘనత సాధించగా తాజాగా ఈ రికార్డ్‌ ని అందుకున్న రెండో మహిళా క్రికెటర్‌ గా మిథాలీ రాజ్ నిలిచింది. ప్రస్తుతం సౌతాఫ్రికా మహిళలతో లక్నో వేదికగా జరుగుతున్న మూడో వన్డేలో మిథాలీ ( 50 బంతుల్లో 4 ఫోర్లతో 36) పరుగులు చేసి అన్నేబాష్‌ బౌలింగ్ ‌లో ఔటైంది. ఈ క్రమంలోనే 35 పరుగుల వ్యక్తిగత స్కోర్‌ వద్ద ఆమె అంతర్జాతీయ క్రికెట్‌లో పదివేల పరుగుల మైలురాయిని చేరుకుంది.

ఈ మ్యాచ్‌ కు ముందు టీమ్ ‌ఇండియా సారథి అన్ని ఫార్మాట్లలో కలిపి 9,965 పరుగులు చేశారు. 1999లో అంతర్జాతీయ క్రికెట్‌ లోకి అడుగుపెట్టిన మిథాలీ సుదీర్ఘకాలంగా భారత క్రికెట్ ‌లో కొనసాగుతున్నారు. 2002లో టెస్టుల్లో అరంగేట్రం చేసి ఆమె 10 మ్యాచ్ ‌లాడి 663 పరుగులు చేశారు. అందులో ఒక సెంచరీ, నాలుగు హాఫ్ సెంచరీలున్నాయి. ఇక వన్డే కెరీర్‌లో 212 మ్యాచ్‌లాడిన మిథాలీ 6,974 పరుగులు చేసింది. అందులో ఏడు సెంచరీలు, 54 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. మరోవైపు టీ20 క్రికెట్‌లో 89 మ్యాచ్‌ లు ఆడగా 2,364 పరుగులు సాధించింది. ఈ ఫార్మాట్‌ లో 17 హాఫ్ సెంచరీలు కొట్టింది. భారత్ తరఫున ఇప్పటి వరకూ 10 టెస్టులు, 89 టీ20 మ్యాచ్‌లాడిన మిథాలీరాజ్ టెస్టుల్లో 663 పరుగులు, టీ20ల్లో 2,364 రన్స్ చేసింది. అలానే ఆడిన 212 వన్డేల్లో మిథాలీరాజ్ 6,974 పరుగులు చేసింది. మిథాలీ రాజ్ 10వేల పరుగుల మార్క్‌ని అందుకోవడంపై బీసీసీఐ స్పందించింది. మిథాలీని ఛాంపియన్ ‌గా అభివర్ణించిన బీసీసీఐ. ఈ ఘనత సాధించిన ఫస్ట్ ఇండియన్ ఉమెన్ క్రికెటర్ ‌గా చెప్పుకొచ్చింది.