Begin typing your search above and press return to search.

మిథాలీ గట్టిగా ఇచ్చింది

By:  Tupaki Desk   |   22 Aug 2017 8:28 AM GMT
మిథాలీ గట్టిగా ఇచ్చింది
X
పురుషుల క్రికెట్లో సచిన్ టెండూల్కర్ ఎలాగో.. మహిళల క్రికెట్లో మిథాలీ రాజ్ అంత గొప్ప క్రీడాకారిణి. సచిన్ లాగే ఆమె కూడా సుదీర్ఘ కాలం దేశానికి సేవలందించింది. ఎన్నో రికార్డులు ఖాతాలో వేసుకుంది. మహిళల క్రికెట్ చరిత్రలోనే వన్డేల్లో అత్యధిక పరుగుుల చేసిన క్రికెటర్ ఆమే. పురుషుల క్రికెట్లో అయినా కాసుల వర్షం కురుస్తుంటుంది కానీ.. మహిళల క్రికెట్లో ఆ పరిస్థితి లేదు. వాళ్లకొచ్చే డబ్బులు అంతంతమాత్రం. కొన్నేళ్ల కిందటి వరకు అమ్మాయిల క్రికెట్ బీసీసీఐ పరిధిలో కూడా లేదు. వాళ్లకు దక్కే మ్యాచ్ ఫీజులు నామమాత్రం. ఇలాంటి పరిస్థితుల్లోనూ ఎంతో అంకిత భావంతో ఆటలో కొనసాగిన గొప్ప క్రికెటర్ మిథాలీ.

ఇలాంటి దిగ్గజం గురించి సోషల్ మీడియాలో ఓ వ్యక్త జుగుప్సాకరమైన కామెంట్ చేశాడు. మిథాలీ ఓ క్రికెట్ సంబంధిత కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం కొందరమ్మాయిలతో కలిసి ఫొటోలకు పోజులిచ్చింది. ఆ సందర్భంగా ఆమె జబ్బల కింద చెమట వల్ల డ్రెస్ తడిచిపోయింది. ఓ నెటిజన్ దాన్ని గుర్తించి.. ఎగతాళిగా కామెంట్ పెట్టాడు. దానికి మిథాలీ తనదైన శైలిలో బదులిచ్చింది. ఈ విషయానికి తాను సిగ్గుపడేదేమీ లేదని.. తానొక క్రికెట్ అకాడమీని ఆరంభించడానికి వచ్చి మైదానంలో తిరిగానని అంది మిథాలీ. ఆమె కామెంట్ కు మద్దతుగా నిలుస్తూ సోషల్ మీడియాలో జనాలు శభాష్ అన్నారు. మిథాలీని ఎగతాళి చేసిన నెటిజన్ పై తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి. సోషల్ మీడియా వచ్చాక సెలబ్రెటీలకు ఇలాంటి తలనొప్పులు.. చెత్త కామెంట్లు మామూలే. ఆ సెలబ్రెటీలు కూడా కొంత వరకు సహనంతో ఉంటారు కానీ.. అవతలి వాళ్లు శ్రుతి మించినపుడు ఇలా రివర్స్ కౌంటర్లు వేయాల్సిందే.