Begin typing your search above and press return to search.

మొన్న రాయుడు.. నేడు మిథాలీ గుడ్ బై

By:  Tupaki Desk   |   3 Sept 2019 4:49 PM IST
మొన్న రాయుడు.. నేడు మిథాలీ గుడ్ బై
X
ఎంత ఆడినా.. ఫాంలో ఉన్న తనను భారత జట్టులోకి ఎంపిక చేయలేదన్న బాధ, కసితో ఇటీవల తెలుగు క్రికెటర్ అంబటిరాయుడు క్రికెట్ కు గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే.. ఆ తర్వాత పెద్దల సూచనలతో మనసు మార్చుకొని రిటైర్ మెంట్ ను వెనక్కి తీసుకున్నారు.

తాజాగా భారత మహిళా జట్టు మాజీ కెప్టెన్ - సీనియర్ క్రీడాకారిణి మిథాలీరాజ్ సడన్ గా టీ20లకు రిటైర్ మెంట్ ప్రకటించడం అందరినీ షాక్ కు గురిచేసింది. దక్షిణాఫ్రికాతో జరగనున్న టీ20 సిరీస్ కు అందుబాటులో ఉంటానని ప్రకటించిన ఆమె ఇంతలోనే రిటైర్ మెంట్ ప్రకటించడం హాట్ టాపిక్ గా మారింది.

అయితే వన్డే క్రికెట్ లో బాగా రాణిస్తున్న మిథాలీని టీ20ల్లో అవకాశం ఇవ్వకపోవడంతో ఆమె ఈ సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. టీ20 క్రికెట్ జట్టు కెప్టెన్ - కోచ్ లు మిథాలీపై వివక్ష చూపుతున్నారని.. అందుకే గత టీ20 సిరీస్ లో జట్టులో చాన్స్ ఇవ్వలేదని.. దీనివల్లే మహిళా టీమిండియా జట్టు టీ20ల్లో ఓడిపోయిందని అప్పట్లో నెటిజన్లు దుమ్మెత్తిపోశారు. దీనిపై కొంతమంది మాజీ క్రికెటర్లు విమర్శలు గుప్పించారు. ఈ విషయం పెద్ద దుమారమే రేపింది.. చివరకు క్రికెట్ పాలిటిక్స్ వల్లే మిథాలీ ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.