Begin typing your search above and press return to search.

ఒకే గ్రౌండ్ లో మిథాలీరాజ్, ధోనీ గేమ్

By:  Tupaki Desk   |   27 Jan 2016 4:30 PM GMT
ఒకే గ్రౌండ్ లో మిథాలీరాజ్, ధోనీ గేమ్
X
ఆస్ర్టేలియాపై టీ20 మ్యాచ్ లో ధోనీసేన గెలవడంతో అభిమానులంతా సంబరాలు చేసుకున్న సంగతి తెలిసిందే. మొన్నటి వన్డే సిరీస్ లో దారుణంగా ఓడిపోయి తిట్లు తిన్న ధోనీ సేన టీ20లో గెలవడంతో అభిమానులు అంతా మరిచిపోయారు. అయితే... ధోనీ సేన గెలిచిన రోజునే... అదే మైదానంలో ఇంకో అద్భుతమూ జరిగింది. ధోనీ టీం కంటే ముందు భారత మహిళా క్రికెట్ జట్టు కూడా ఆస్ర్టేలియా టీం ను టీ20లో ఓడించింది... మూడు మ్యాచ్‌ ల మహిళా టీ20 సిరీస్‌ లో భాగంగా మంగళవారం తొలి మ్యాచ్‌ లో భారత మహిళల జట్టు 5 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాపై గెలుపొందింది. రికార్డు లక్ష్యాన్ని ఛేదించి ప్రపంచ చాంపియన్స్‌ కు షాకిచ్చింది. టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న భారత జట్టు మిథాలీ రాజ్ నేతృత్వంలో తొలుత బ్యాటింగ్‌ కు దిగిన ఆస్ట్రేలియాను నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 140 పరుగులకు కట్టడి చేయగలిగింది. ఆ తర్వాత భారత జట్టు 18.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 141 పరుగులు సాధించింది. ఈ క్రమంలో భారత జట్టు అసాధారణ ప్రతిభ కనబరించింది. ఇక రెండో టీ20 మ్యాచ్‌ శుక్రవారం మెల్‌బోర్న్‌ లో - మూడో మ్యాచ్‌ ఆదివారం సిడ్నీలో జరుగుతాయి.

కాగా మిథాలీ టీం గెలిచిన మైదానంలోనే మధ్యాహ్నం ధోనీ సేన ఆస్ట్రేలియా పురుషుల జట్టుపై గెలిచింది. వన్డేల్లో ఘోర పరాజయంపాలైన మెన్‌ ఇన్‌ బ్లూ ఆస్ట్రేలియాపై ప్రతీకారానికి తీర్చుకుంది. తొలి మ్యాచ్‌ లో టీమిండియా 37 పరుగు ల తేడాతో ఆస్ట్రేలియాపై గెలిచింది. దీంతో ఒకే మైదానంలో సొంత గడ్డపైనే ఆస్ర్టేలియా పురుషుల - మహిళల జట్లను ఇండియా టీంలు ఓడించడం విశేషం.