Begin typing your search above and press return to search.
ట్రంప్ సారూ...సింగిల్ స్పీచ్ లో ఇన్ని తప్పులా?
By: Tupaki Desk | 24 Feb 2020 3:48 PM GMTఅగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇండియా టూర్ పై ఇటు భారత్ లోనే కాకుండా విశ్వవ్యాప్తంగా ఆసక్తి నెలకొందనే చెప్పాలి. ఎందుకంటే అమెరికా అధ్యక్షుడి హోదాలో ట్రంప్ తొలిసారిగా భారత్ కు విచ్చేస్తున్నారు కాబట్టి. అంతేకాకుండా భారత పర్యటనపై తనకు ఎంత ఆసక్తి ఉందన్న విషయాన్ని ట్రంప్ పదే పదే చెప్పడం కూడా ఈ ఆసక్తిని రేకెత్తించింది. రెండు రోజుల ఇండియా టూర్ లో ట్రంప్ ఎలాంటి కీలక ప్రకటనలు చేస్తారోనన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. ట్రంప్ టూర్ లో కీలకమైనది మోతేరా స్టేడియంలో ‘నమస్తే ట్రంప్’ పేరిట నిర్వహించిన భారీ సభే. లక్షలాది మంది హాజరైన ఈ సభలో ట్రంప్ అందరినీ నిరుత్సాహానికి గురి చేశారు. నోరు తిరగని తన శైలిని బయటపెట్టుకున్న ట్రంప్... తన ప్రసంగంలో లెక్కలేనన్ని తప్పులు పలికేశారు.
అయినా ట్రంప్ తన ప్రసంగంలో ఏఏ పదాలను తప్పుగా పలికారన్న విషయానికి వస్తే... భారత ప్రధాని నరేంద్ర మోదీని అందరూ ‘చాయ్ వాలా’ అంటారు కదా. మోదీ కూడా తనను తాను చాయ్ వాలాగానే చెప్పుకుంటారు. ఇదే పదాన్ని పలికేందుకు ఆపసోపాలు పడిన ట్రంప్... చాయ్ వాలాను కాస్తా ‘చివాలా’గా మార్చిపారేశారు. మోదీ తనకు అత్యంత సన్నిహితుడని చెప్పుకునే ట్రంప్... మోదీకి అత్యంత ప్రజాదరణ కలిగించిన చాయ్ వాలా పేరును కూడా సరిగ్గా పలకలేకపోవడం గమనార్హం. ఒక్క చాయ్ వాలాతోనే ట్రంప్ తప్పుల తడకలు ఆగలేదండోయ్.. చాలా పదాలను, పలు రంగాలకు చెందిన ప్రముఖుల పేర్లను కూడా పలకలేక ఆయన ఆపసోపాలు పడ్డారు.
‘ది వేదాస్’అనే పదాన్ని ‘ది వెస్తాస్’ అంటూ పలికిన ట్రంప్... స్వామి వివేకానంద పేరును ‘స్వామి వివేక్ మాన్ ‘ అని పలికారు. అలాగే సచిన్ టెండూల్కర్ పేరును ‘సూచిన్ టెండూల్కర్’ అని, విరాట్ కోహ్లీని ‘విరూట్ కోహ్లీ’ అని ఉచ్ఛరించిన ట్రంప్... బ్లాక్ బస్టర్ బాలీవుడ్ మూవీ ‘షోలే’ను ‘షోజే’ అని పలికారు. ట్రంప్ తన ప్రసంగాన్ని అలా కొనసాగిస్తూ పోతుంటే... ఆయన నోట నుంచి వచ్చిన తప్పుడు పదాలను గుర్తించిన చాలా మంది వాటిని సోషల్ మీడియాలో పెట్టేసి ఆయనను ఓ రేంజిలో ఆటాడేసుకున్నారు. అంతేకాకుండా ట్రంప్ నోట వచ్చిన తప్పులను ప్రస్తావిస్తూ ‘ఇది…. టెరిబుల్ ప్రొనౌన్సియేషన్ బై ట్రంప్ ఆఫ్ హిందీ వర్డ్స్’ అని ఒకరు సెటైర్ వేస్తే..మరికరు ఈ వ్యక్తుల పేర్లను ప్రస్తావించే ముందు ట్రంప్ తమ దేశంలో బాగా ‘హోమ్ వర్క్’ చేసినట్టు ఉందని వ్యాఖ్యానించారు.