Begin typing your search above and press return to search.

సత్యదేవుని కళ్యాణ పత్రికలో తప్పులు

By:  Tupaki Desk   |   5 May 2016 10:27 AM GMT
సత్యదేవుని కళ్యాణ పత్రికలో తప్పులు
X
తూర్పుగోదావరి జిల్లాలోని ప్రముఖ ఆలయం అన్నవరం సత్యదేవుని కోవెల తరచూ వివాదాస్పదమవుతోంది. అన్నవరం సత్యనారాయణ స్వామి వారి కళ్యాణానికి సంబంధించి తయారుచేసిన ఆహ్వాన పత్రిక లో తప్పులు దొర్లడంతో భక్తులు ఆగ్రహిస్తున్నారు. సత్యదేవుని కళ్యాణ ఆహ్వానపత్రికల పత్రిక మొత్తం తప్పులతడకగా ఉందని... భగవంతుని కళ్యాణం విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని మండిపడుతున్నారు.

దుర్ముఖి నామ సంత్సరానికి బదులుగా జయ నామ సంవత్సరమని.. మంగళవారానికి బదులు శనివారమని ఈ ఆహ్వాన పత్రికలో ముద్రించారు. దీంతో భక్తులు - స్థానికులు కూడా ఆలయ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.

కాగా, అన్నవరం కొండపై ఇంతకుముందు జరిగిన ఒక వివాహవేడుకల్లో అశ్లీల నృత్యాలను తలపించే విధంగా డ్యాన్సులు చేసిన విషయం తెలిసిందే. అప్పుడూ ఆలయ అధికారుల నిర్లక్ష్యం బయటపడింది. తాజాగా ఏకంగా భగవంతుని కళ్యాణం విషయంలోనూ అధికారులు నిర్లక్ష్యం వ్యవహరించడంతో ఇదేమిటని భక్తులు ప్రశ్నిస్తున్నారు. తక్షణం పొరపాట్లు సరిదిద్ది తప్పుల్లేని కళ్యాణ పత్రికలు ముద్రించాలని.. కళ్యాణం ఏర్పాట్లలోనూ పొరపాట్లకు అవకాశమివ్వకుండా జాగ్రత్తలు పడాలని స్థానికులు సూచిస్తున్నారు.