Begin typing your search above and press return to search.
వ్యాక్సిన్ ప్రయోగంలో పొరపాటు.. మేలే చేసిందట.. అదెలానంటే?
By: Tupaki Desk | 27 Nov 2020 4:45 AM GMTకరోనాకు చెక్ పెట్టే వ్యాక్సిన్ తయారీపై పెద్ద ఎత్తున పరిశోధనలు జరుగుతున్న విషయం తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా వందకు పైగా సంస్థలు వ్యాక్సిన్ తయారీలో తలమునకలై ఉంటే.. పది సంస్థలు చేస్తున్న ప్రయోగాలపై భారీ అంచనాలు ఉన్నాయి. ఆ పదింటిలో ఒకటి ఆక్స్ ఫర్డ్.. ఆస్ట్రాజెనెకా తయారు చేస్తున్న టీకా. ఈ వ్యాక్సిన్ ప్రయోగంలో వచ్చిన ఫలితాలు కాసింత గందరగోళానికి గురి చేశాయి.
వ్యాక్సిన్ డోస్ తక్కువ మోతాదులో వినియోగించినప్పుడు చక్కటి ఫలితాలు వస్తే.. ఎక్కువ మోతాదులో వాడినప్పుడు సరైన ఫలితాలు రాకపోవటంతో గందరగోళం చోటుే చేసుకుంది. రెండు రకాల డోసుల్లో టీకాను పరీక్షించినట్లుగా చెప్పింది. కోవిడ్ నుంచి తమ వ్యాక్సిన్ తో 90వాతం రక్షణ లభించిందని చెబుతున్నా.. వ్యాక్సిన్ మోతాదు ఎక్కువగా వినియోగించిన వేళలో మాత్రం62 శాతం మాత్రమే రక్షణ లభించిందన్న విషయాన్ని వెల్లడించింది.
ఈ వైరుధ్యానికి కారణం తమకు తెలీదని ఆక్స్ ఫర్డ్ పరిశోధకులు తెలియజేయటం.. మొత్తంగా ఈ వ్యాక్సిన్ సగటున 70 శాతం సమర్థతను చాటినట్లుగా చెప్పాలి. భిన్న డోసుల మధ్య సమర్థత విషయంలో వచ్చిన తేడాపై విశ్లేషణ మొదలైంది. దీనికి సంబంధించిన వివరాల్ని న్యూయార్క్ టైమ్స్ పత్రిక తాజాగా వెల్లడించింది.
దీని ప్రకారం.. వ్యాక్సిన్ డోస్ తగ్గించి వాడటం అన్నది పారపాటుగా జరిగినట్లుగా చెబుతున్నారు. ఒకరకంగా చూస్తే.. ఈ పొరపాటు కారణంగా మంచే జరిగినట్లుగా భావిస్తున్నారు. టీకా చూపిన అద్భుత ఫలితాల్లో పెద్ద వయస్కుల విషయంలో లేదని చెబుతున్నారు. దీంతో.. ఈ వ్యాక్సిన్ ను అత్యవసర వినియోగానికి అనుమతించటం కష్టమేనని చెబుతున్నారు. ఏమైనా పొరపాటుతో మేలు జరిగిందని చెప్పక తప్పదు.