Begin typing your search above and press return to search.

54 స్థానే 52తో ఇచ్చిన ఎంబామింగ్ స‌ర్టిఫికేట్‌

By:  Tupaki Desk   |   28 Feb 2018 5:52 AM GMT
54 స్థానే 52తో ఇచ్చిన ఎంబామింగ్ స‌ర్టిఫికేట్‌
X
అన్ని రూల్స్ ప్ర‌కారం చేస్తాం. ఎక్క‌డా ఎలాంటి త‌ప్పున‌కు అవ‌కాశం ఇవ్వం. ఎవ‌రి ఒత్తిడి మా మీద ఉండ‌దు.చివ‌ర‌కు దేశ రాజు కూడా జోక్యం చేసుకోలేరు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే గొప్ప‌లు చెప్పారు దుబాయ్ అధికారుల గురించి. మ‌రిన్ని గొప్ప‌లు చెప్పినప్పుడు వారి ప‌ని తీరు ఎలా ఉండాలి? ఎంత క‌చ్ఛిత‌త్వంతో ఉండాలి.

కానీ.. శ్రీ‌దేవి ఎపిసోడ్ లో దుబాయ్ అధికారులు జారీ చేసిన రెండు కీల‌క స‌ర్టిఫికేట్ లో త‌ప్పులు దొర్ల‌టం క‌నిపిస్తుంది. మొద‌ట జారీ చేసిన స‌ర్టిఫికేట్ లో అక్ష‌ర దోషంతో ఇష్యూ చేస్తే.. కీల‌క‌మైన ఎంబామింగ్ స‌ర్టిఫికేట్ లోనూ త‌ప్పు దొర్లింది. ప్ర‌మాద‌వ‌శాత్తు బాత్రూం బాత్ ట‌బ్ లో మునిగి చ‌నిపోయిన‌ట్లుగా శ్రీ‌దేవి ఎంబామింగ్ స‌ర్టిఫికేట్ లో దుబాయ్ ఆరోగ్య శాఖ నిర్థారించింది. ఆమెకు ఎలాంటి ఇన్ ఫెక్ష‌న్ సోకే వ్యాధులు లేవ‌ని పేర్కొంది.

త‌మ ద‌గ్గ‌రున్న శ్రీ‌దేవి పార్థిప‌దేహానికి ఎంబామింగ్ పూర్తి చేసి వారి కుటుంబ స‌భ్యుల‌కు అంద‌జేసిన‌ట్లుగా దుబాయ్ హెల్త్ అథారిటీకి చెందిన అష్రాఫ్ వెల్ల‌డించారు. దీనికి ముందు శ్రీ‌దేవి మృతి కేసును క్లోజ్ చేస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. ఇదిలా ఉండ‌గా.. ఎంబామింగ్ స‌ర్టిఫికేట్ లో శ్రీ‌దేవి వ‌య‌సును 54 కాస్తా 52గా పేర్కొన‌టం గ‌మ‌నార్హం. అన్ని ప‌క్కాగా చేస్తాం.. ఎక్క‌డా ఎలాంటి త‌ప్పులు దొర్ల‌వ‌ని చెప్పే వేళ‌.. ఇలాంటి త‌ప్పుల‌కు స‌మాధానం ఏమిటి? అన్న‌ది ప్ర‌శ్న‌గా మారింది.