Begin typing your search above and press return to search.

మిస్ అయిన తొగాడియా ఆసుప‌త్రిలో ఉన్నార‌ట‌!

By:  Tupaki Desk   |   16 Jan 2018 5:12 AM GMT
మిస్ అయిన తొగాడియా ఆసుప‌త్రిలో ఉన్నార‌ట‌!
X
ప్ర‌వీణ్ తొగాడియా అంటే అల్లాట‌ప్పా వ్య‌క్తేం కాదు. కానీ.. అత‌గాడు మిస్ అయ్యాడంటూ.. ఆయ‌న్ను అమితంగా ఆరాధించే విశ్వ‌హిందూ ప‌రిష‌త్ కు చెందిన కొంద‌రు ఆందోళ‌న చేశారు. అందులో నిజమెంతో? అన్న‌ది ప‌క్క‌న పెట్టేసి వెంట‌నే బ్రేకింగ్ న్యూస్ లు వేసేశాయి కొన్ని ఛాన‌ళ్లు. తొగాడియా ఏమైనా చిన్న‌పిల్లాడా? అత‌గాడికి జెడ్ ప్ల‌స్ సెక్యురిటీ ఉంద‌న్న విష‌యాన్ని మ‌ర్చిపోకూడ‌దు.

ఒక‌వేళ‌.. అత‌నికి ఏమైనా జ‌రిగితే.. అత‌డికి ర‌క్ష‌ణ క‌ల్పించే జెడ్ ప్ల‌స్ క‌మాండోల తాట తీస్తారు. అయినా.. విశ్వ‌హిందు ప‌రిష‌త్ అంత‌ర్జాతీయ కార్య‌నిర్వాహ‌క అధ్య‌క్షుడ్ని ఎవ‌రు మాత్రం ట‌చ్ చేయ‌గ‌ల‌రు. ఆయ‌న‌పై కేసులున్నా.. వాటిని విచారించే ధైర్యం చేయ‌గ‌ల‌రా? అందునా మోడీ స‌ర్కారు హ‌యాంలో అంటూ రాగాలు తీసేవారు లేక‌పోలేదు.
ఇంత‌కీ తొగాడియా మిస్ ఉదంతం ఏమిటి? ఎందుకా వార్త‌లు వ‌చ్చాయ‌న్న డిటైల్స్ లోకి వెళితే.. దేశంలో ప‌లుచోట్ల కేసులు న‌మోదైన‌ట్లే.. రాజ‌స్థాన్ లోనూ ఈ నేత మీద కేసులు ఉన్నాయి.

ఇలాంటి పాత కేసు విచార‌ణ కోసం తొగాడియా ఇంటికి వెళ్లారు రాజ‌స్థాన్ పోలీసులు. అంతే.. తొగాడియా ఇంట్లో క‌నిపించ‌టం లేద‌న్న వార్త టీవీల్లోకి వ‌చ్చేసింది. అంత పెద్ద మ‌నిషి మిస్ అంటే ఆందోళ‌న ప‌డ‌కుండా ఉండ‌లేరు క‌దా. ఈ ఇష్యూ మ‌రింత వైర‌ల్ కాక ముందే రాజ‌స్థాన్ పోలీసులు రియాక్ట్ అయ్యారు. తాము ఆయ‌న నివాసానికి వెళ్లామ‌ని.. అయితే.. ఆయ‌న లేర‌ని చెబితే వెన‌క్కు వ‌చ్చేసిన‌ట్లు విన్న‌వించుకున్నారు.

అయిన‌ప్ప‌టికీ ఆ మాట‌ల్ని విశ్వ‌హిందూ ప‌రిష‌త్ కార్య‌క‌ర్త‌లు ప‌ట్టించుకోలేదు. రాజ‌స్థాన్ పోలీసులు త‌మ నేత‌ను అదుపులోకి తీసుకున్నారంటూ అనుమానాన్ని వ్య‌క్తం చేస్తూ యూపీలోని సోలా పోలీస్ స్టేష‌న్ ద‌గ్గ‌ర కొంద‌రు ఆందోళ‌న చేప‌ట్టారు. ఈ ఆందోళ‌న అంత‌కంత‌కూ పెరిగిపోతున్న వైనంతో అలెర్ట్ అయిన పోలీసులు.. ఆందోళ‌కారుల్ని కంట్రోల్ చేసే ప్ర‌య‌త్నం చేశారు.

ఇదిలా ఉంటే.. తొగాడియా మిస్ కాలేద‌ని.. ఆయ‌న తీవ్ర అస్వ‌స్థ‌త‌తో ఆసుప‌త్రిలో చికిత్స తీసుకుంటున్న‌ట్లుగా వార్త‌లు వ‌చ్చాయి. గ్లూకోజ్ లెవ‌ల్స ప‌డిపోవ‌టంతో ఆయ‌న్ను అహ్మ‌దాబాద్ లోని ఒక ఆసుప‌త్రిలో చికిత్స నిర్వ‌హిస్తున్న‌ట్లు పేర్కొన్నారు. 65 ఏళ్ల తొగాడియా మిస్సింగ్ అంటూ వ‌చ్చిన వార్త‌లు త‌ప్ప‌న్న‌ది తేలిపోగా.. తీవ్ర అనారోగ్యానికి గురైన విష‌యం బ‌య‌ట‌కు రావ‌టంతో వీహెచ్ పీ కార్య‌క‌ర్త‌లు ప‌లువురు ఆందోళ‌న‌కు గుర‌వుతున్నారు. ప్ర‌స్తుతం ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితి నిల‌క‌డ‌గా ఉన్న‌ట్లుగా చెబుతున్నారు. తొగాడియా ఆరోగ్య ప‌రిస్థితికి సంబంధించి వైద్యుల నుంచి త‌ర‌చూ హెల్త్ బులిటెన్లు రాక‌పోవ‌టంతో తొగాడియా కుటుంబ స‌భ్యులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు.

ఇదిలా ఉంటే మిస్ అయిన‌ట్లు చెబుతున్న తొగాడియా సోమ‌వారం రాత్రి 9.20 గంట‌ల వేళ పార్కులో అప‌స్మార‌క స్థితిలో ప‌డిపోయి ఉన్న‌ట్లు గుర్తించి.. ఆసుప‌త్రికి తీసుకొచ్చిన‌ట్లుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఒక‌వేళ‌.. అదే నిజ‌మైతే.. ఆయ‌న వెంట ఉన్న జెడ్ ప్ల‌స్ సెక్యురిటీ ఏమైన‌ట్లు? అన్న సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఏమైనా.. తొగాడియా మిస్సింగ్‌.. ఆయ‌న ఆసుప‌త్రికి చేరిన వైనం మొత్తం కాస్తంత గంద‌ర‌గోళంగా మారింది.