Begin typing your search above and press return to search.
టైటానిక్ కోసం వెళ్లి... మరో టైటానిక్ అయ్యేలా ఉందే..!
By: Tupaki Desk | 21 Jun 2023 1:00 PM GMTదాదాపు వందేళ్ల క్రితం అట్లాంటిక్ మహాసముద్ర్ంలో టైటానిక్ షిప్ మునిగిపోయిందనే విషయం తెలిసిందే. అయితే, ఆ టైటానిక్ శిథిలాలను పరిశీలించడానికి వెళ్లి ఓ సబ్ మెరైన్ కూడా గల్లంతవ్వడం గమనార్హం. టైటానిక్ శిథిలాలు చూడటానికి ఐదుగురు సభ్యులతో కూడిన ఓ బృందం ''టైటాన్ సబ్ మెర్సిబుల్'' పేరుతో సబ్ మెరైన్లో సముద్రంలోకి వెళ్లారు. అయితే, ఈ సబ్ మెర్సిబుల్ క్రాఫ్ట్ (చిన్నపాటి జలాంతర్గామి) నుంచి కమ్యూనికేషన్ తెగిపోయిందని టూర్ నిర్వాహకులు తెలిపారు.
ఓడలో ఒక పైలట్, నలుగురు ప్రయాణికులు ఉన్నారు.మునిగిన నౌకలో బ్రిటన్ దేశానికి చెందిన సాహస యాత్రికుడు హమీష్ హార్డింగ్, పాక్ బిలియనీర్ షాజాదా దావూద్, ఆయన కుమారుడు సులేమాన్ మరో ఇద్దరు పర్యాటకులున్నారు. వీరు సరదా కోసం చేసిన ప్రయత్నం చిక్కులు తెచ్చిపెట్టింది.
మహాసముద్రంలో కనిపించకుండా పోయిన టూరిస్టులతో కూడిన సబ్ మెరైన్ కోసం టూర్ నిర్వహణ సంస్థ ఓషియన్ గేట్ కంపెనీతోపాటు ప్రభుత్వం గాలింపు చర్యలు చేపట్టింది. వారిని క్షేమంగా బయటకు తీసుకురావడానికి చాలా శ్రమిస్తున్నారు. ప్రభుత్వ సహాయం తీసుకొని మరీ గాలిస్తున్నారు. అయితే, వారు చాలా ప్రమాదంలో ఉన్నరని తెలుస్తోంది. ఎందుకంటే వారి దగ్గర సరిపడా ఆక్సీజన్ కూడా లేదు కేవలం నాలుగు రోజులకు మాత్రం సరిపోయే ఆక్సీజన్ ఉందట.
ఓషన్ గేట్ అనే సంస్థ ఇప్పటి వరకు చాలా మందికి టైటానిక్ శిథిలాలను చూపించింది. ఈ విషయంలో ఈ సంస్థ చాలా ఎక్స్ పర్ట్. 1912లో టైటానిక్ షిప్ మంచు కొండను ఢీకొని అట్లాంటిక్ మహా సముద్రంలో మునిగిపోయింది. అయితే, ఈ ఓషన్ గేట్ సంస్థ 2.5 లక్షల డాలర్లు చెల్లించి పర్యాటకులకు ఈ టైటానిక్ శిథిలాలు చూపించడం మొదలుపెట్టింది.
ఈ క్రమంలో ఈ పర్యాటక బృందం కూడా వాటిని చూడటానికి బయటలు దేరింది. న్యూ ఫౌండ్ లాండ్ నుంచి మొదలైన యాత్ర 400 నాటికల్ మైళ్ల దూరంలోని టైటానిక్ శకలాల వద్దకు చేరాల్సి ఉండగా సెయింట్ జాన్స్ కు దక్షిణాన 700 కిలోమీటర్ల దూరంలో ఉండగా కమ్యూనికేషన్ మిస్ అయ్యింది. ఇప్పటి వరకు వారి ఆచూకీ తెలియలేదు.
ఈ నౌక సముద్ర అడుగుభాగంలో ఉంటే దీన్ని రక్షించడం అసాధ్యమని నిపుణులు చెబుతున్నారు. దీనిని బయటకు తీయడం కూడా చాలా కష్టమని తెలుస్తోంది. అయితే ఈ టూరిస్టులతో కూడిన సబ్ మెరైన్ ఎప్పుడు గల్లంతైంది అనే విషయాన్ని మాత్రం కంపెనీ ఇంత వరకు వెల్లడించలేదు. చూడాలి మరి, ఏం జరుగుతుందో.