Begin typing your search above and press return to search.

ట్రంప్ సంసారంలో చిచ్చు..మెలానియా ట్వీట్‌

By:  Tupaki Desk   |   31 May 2018 12:26 PM GMT
ట్రంప్ సంసారంలో చిచ్చు..మెలానియా ట్వీట్‌
X
అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్‌ కు సంబంధించిన మ‌రో సంచ‌ల‌న అంశం తెర‌మీద‌కు వ‌చ్చింది. వివాదాస్ప‌ద ప్ర‌వ‌ర్త‌నకు కేరాఫ్ అడ్ర‌స్ అయిన ట్రంప్‌తో ఆయ‌న భార్య మెలానీయా ట్రంప్ విడిపోయింద‌నేది ఈ వార్తల సారాంశం. అయితే ఈ వార్త‌కు అనూహ్య తెర‌ప‌డింది. కొన్నాళ్ల నుంచి డొనాల్డ్ ట్రంప్ - మెలానియా మధ్య సంబంధాలు సరిగా లేవని వదంతులు వ్యాపించాయి. ఇద్దరూ విడిపోయేందుకు సిద్ధంగా ఉన్నట్లు పుకార్లు చెలరేగాయి. సోషల్ మీడియాలో ఆ వార్తలే వైరల్‌ గా మారాయి. కానీ వైట్‌ హౌజ్ మాత్రం ఆ పుకార్లను కొట్టిపారేసింది. అయినా, ఆ పుకార్ల‌కు తెర‌ప‌డ‌లేదు. దీంతో స్వ‌యంగా మెలానీయానే రంగంలోకి దిగారు.

గత 20 రోజుల నుంచి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భార్య మెలానియా మీడియాకు దూరంగా ఉన్నారు. ఆమె ఆరోగ్యం - వివాహ బంధంపై కొన్ని అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఓ దశలో తన కుమారుడు బారన్‌ తో కలిసి మెలానియా తన తల్లిగారి ఇంటికి వెళ్లినట్లు కూడా సోషల్ మీడియాలో పుకార్లు చెలరేగాయి. ప్రతి ఏడాది ఫస్ట్ లేడీ హాజరయ్యే వైట్‌ హౌజ్‌ లోని స్పోర్ట్స్ వేడుకకు మెలానియా డుమ్మా కొట్టడంతో ఆ అనుమానాలు మరింత బలపడ్డాయి. మెలానియా ఇటీవల ఓ అయిదు రోజుల పాటు వాషింగ్టన్ డీసీలోని మిలిటరీ హాస్పటల్‌ లో కిడ్నీ చికిత్స చేయించుకున్నారు. ఆ తర్వాత ఆమె మళ్లీ రెండు రోజుల క్రితమే వైట్‌ హౌజ్‌ కు వచ్చారు. దీంతో అమెరికా ఫస్ట్ లేడీ మెలానియా ట్రంప్‌ ను ఉద్దేశించి ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు రేగింద‌ని అంచ‌నాలు వేశారు. ట్రంప్‌తో ఆమె దూరంగా ఉంటోంద‌ని పేర్కొన్నారు. అయితే దీనికి మెలానియా బ్రేకేశారు. సోషల్ సర్కిల్స్‌ లో వ్యాపిస్తున్న వదంతులకు ఓ ట్వీట్‌ తో ఆమె చెక్ పెట్టారు. వైట్‌ హౌజ్‌ కు వచ్చేశాను, ఫ్యామిలీతోనే ఉన్నానని మెలానియా తన అకౌంట్ నుంచి ట్వీట్ చేశారు. అయితే తాజాగా మెలానియా అకౌంట్ నుంచి ట్వీట్ వచ్చిన అంశం పట్ల కూడా నెట్‌ జన్లు విమర్శలు వ్యక్తం చేశారు. మెలానియా అకౌంట్ నుంచి డొనాల్డ్ ట్రంపే ఆ ట్వీట్ చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తుండ‌టం కొస‌మెరుపు.