Begin typing your search above and press return to search.
30 ఏళ్ల క్రైం కథ.. అస్థికలే మిగిలాయి..
By: Tupaki Desk | 25 Jun 2018 7:58 AM GMTఅది 1989 జూలై 23.. మంచి వానా కాలం.. కరీంనగర్ జిల్లాలో భారీ వర్షం కురుస్తోంది. కరీంనగర్ మండలం ఇరుకుల్ల శివారు పెద్ద వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఇరుకుల్ల నుంచి కరీంనగర్ వెళ్లాలంటే మధ్యలో ఉన్న వాగు దాటాలి. పురాతన బ్రిడ్జిపై నుంచి వెళ్లాలి. ఆ సమయంలోనే జోరు వాన - వరద నీటిని దాటుకుంటూ ఓ లారీ బయలు దేరింది. శంకరపట్నంకు చెందిన ఒక లారీని డ్రైవర్ ఇరుకుల్ల వాగు బ్రిడ్జిపై నుంచి పోనిచ్చాడు. లారీ మధ్యలోకి వెళ్లగానే బ్రిడ్జి కూలిపోయింది. వరదదాటికి లారీ వాగులో కొట్టుకుపోయింది. ప్రమాద సమయంలో మొత్తం లారీలో 9 మంది ఉన్నారు. డ్రైవర్ ఘనీబాయ్ సంఘటన స్థలంలోనే మృతిచెందగా.. మరో నలుగురు ఈదుకుంటూ ఒడ్డుకు వచ్చారు. మరో నలుగురు గల్లంతయ్యారు. వాగు ఉధృతి రెండు రోజుల తర్వాత తగ్గింది. కుటుంబ సభ్యులు మృతదేహాల కోసం - లారీ కోసం ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో 1989 జూలై 27న కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. అప్పటి నుంచి 30 ఏళ్లుగా వారు ఏమై పోయారనే మిస్టరీ వీడలేదు. కనీసం వారి మృతదేహాలు - అంత పెద్ద లారీ కూడా వాగులో ఎక్కడా కనిపించలేదు. కట్ చేస్తే..
ఈనెల 9న వాగులో ఇసుక తవ్వకాలు చేపట్టారు. ఆశ్చర్యకరంగా లారీ విడిభాగాలు బయటపడ్డాయి.నంబర్ ప్లేటు బయటపడింది. విషయం తెలుసుకున్న లారీ ఓనర్ దౌలత్ ఖాన్ - కుటుంబ సభ్యులు అధికారులకు విన్నవించి తవ్వకాలు చేపట్టాలని కోరారు. దీంతో ఇరుకుల్ల పెద్ద వాగులో తవ్వారు. లారీతో పాటు అందులో మూడు మృతదేహాల అస్థికలు బయటపడ్డాయి. కానీ ఎవరిది ఏ అస్థికలో తెలియకపోవడంతో కుటుంబ సభ్యుల రక్తాన్ని సేకరించి అస్థికల డీఎన్ ఏతో పోల్చి అప్పగిస్తామని అధికారులు తెలిపారు.
ఇక ఇందులో ట్విస్ట్ ఏంటంటే 30 ఏళ్ల కింద గల్లంతైన వారిపై ఇన్సూరెన్స్ ఉంది. వారు చనిపోయారని ఇన్సూరెన్స్ డబ్బులు ఇవ్వాలని అప్పట్లోనే మృతుల కుటుంబ సభ్యులు సదురు ఇన్సూరెన్స్ కంపెనీని కోరగా.. వారు గల్లంతయ్యారని.. చనిపోయినట్టు మరణ ధృవపత్రం తెస్తేనే ఇన్సూరెన్సూ డబ్బులు ఇస్తామని ఎగ్గొట్టారు. అధికారులు కూడా మృతదేహం లభిస్తేనే మరణ ధృవపత్రం ఇస్తామని మెలిక పెట్టారు. దీంతో 30 ఏళ్లుగా లభించని ఆచూకీ ఇప్పుడు దొరికింది. బాధితుల అస్థికల ఆధారంగా గుర్తింపు పూర్తై అధికారులు మరణ ధృపత్రాలు ఇస్తే వారికి ఇన్సూరెన్స్ ద్వారా డబ్బు అందనుంది. 30 ఏళ్ల క్రితం వాగు ఉదృతికి లారీ కూడా ఇసుకలో కూరుకుపోవడంతో ఈ నిజం ఇన్నాళ్లు బయటపడలేదు. ఇన్నాళ్లకు తవ్వకాల వల్ల అది బయటపడడంతో జనం ఈ విషాధ ఘటనపై చర్చించుకుంటున్నారు.