Begin typing your search above and press return to search.

కేసీఆర్ ‘కోర్టు’లో ఆ మంత్రిపై మరో ఛార్జిషీట్ల

By:  Tupaki Desk   |   30 March 2021 9:30 AM GMT
కేసీఆర్ ‘కోర్టు’లో ఆ మంత్రిపై మరో ఛార్జిషీట్ల
X
తెలంగాణ రాష్ట్ర అధికారపక్షమైన టీఆర్ఎస్ వరకు వస్తే.. దాని అధినేత కేసీఆర్ వరకు ప్రత్యేకంగా ఒక కోర్టు ఉందని చెప్పాలి. పార్టీ ప్రయోజనాల్ని దెబ్బ తీసేలా ఎవరు వ్యవహరించినా ఆయన ఊరుకోరు. కంటికి కనిపించని పార్టీ కోర్టులో అన్నీ తానైన సారు.. పార్టీ నేతలకు సంబంధించిన ప్రతి విషయాన్ని ఎప్పటికప్పుడు ‘విషయాల్ని’ సేకరిస్తూ ఉంటారు.ఈ కారణంతోనే.. గులాబీనేతలు చాలామంది ఫోన్లలో మాట్లాడేందుకు సైతం ఇష్టపడరు. తమ ఫోన్లు ట్యాప్ అవుతున్నాయన్న మాటను అంతర్గత సంభాషణల్లో ప్రస్తావిస్తుంటారు. అందుకే.. వాట్సాప్ లాంటివి కూడా ఇటీవల కాలంలో బంద్ చేసినట్లుగా చెప్పక తప్పదు.

ఇదిలా ఉంటే.. ఇటీవల కాలంలో పార్టీకి చెందిన కీలక నేత ఒకరి మీద అదే పనిగా చార్జిషీట్లు ఫైల్ అవుతున్నట్లు చెబుతున్నారు. పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని.. తన నాయకత్వం మీదా.. తన వారసుల మీద అగ్రహంగా ఉన్నరన్న విషయానికి సంబంధించి ఆయన ఎప్పటికప్పుడు ఆధారాల్ని సేకరిస్తున్నట్లు చెబుతున్నారు. తన సొంత క్యాడర్ తో పాటు.. ప్రజల్లో పలుకుబడిన కలిగిన సదరు నేతను.. మిగిలిన వారి మాదిరి ట్రీట్ చేస్తే కుదరదన్న ఉద్దేశంతో.. ఆయన మీద ప్రత్యేకంగా ఫోకస్ చేశారని చెబుతున్నారు.

ఇదిలా ఉంటే.. తన విషయంలో పార్టీ అధినేత గుర్రుగా ఉన్నట్లు గమనించిన ఆయన.. ఆచితూచి అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని చెబుతారు. అయితే.. ఇటీవల ముగిసిన పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఎన్నికల సందర్భంగా ఆయన రెండుసార్లు ఎవరికిఎలాంటి సమాచారం అందించకుండానే ఒంటరిగా ఎవరినో కలవటానికి వెళ్లినట్లుగా చెబుతున్నారు. అది కూడా.. అర్థరాత్రి దాటిన తర్వాత బయటకు వెళ్లిన ఆయన.. తెల్లవారుజామున తిరిగి వస్తున్న వైనం కేసీఆర్ వరకు వెళ్లినట్లుగా చెబుతున్నారు. ఇప్పుడా నేత ఎవరన్న విషయంపై పార్టీలో హాట్ టాపిక్ గా మారింది.

ఇటీవల కాలంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ ఆ సీనియర్ నేతకు ఎలాంటి బాధ్యతలు అప్పగించలేదంటున్నారు. ఈ విషయమై సదరు మంత్రి మరింత వేదనకు గురి అయినట్లుగా తెలుస్తోంది. అయితే.. అర్థరాత్రి దాటిన తర్వాత గన్ మెన్లను.. ఇతర సిబ్బందిని వదిలేసి.. కారులో వెళ్లి రావటం ఇప్పుడు కొత్త కలకలాన్ని రేపింది. ఎందుకు వెళుతున్నారు? ఎక్కడికి వెళుతున్నారన్న ప్రశ్నకు సమాధానాలు రాని పరిస్థితి. ఏమైనా.. కీలకమైన మంత్రిగారు ఉన్నట్లుండి మిస్ అయి.. మళ్లీ తిరిగి వచ్చేసిన వైనంపై అంతర్గత విచారణ జరుగుతుందని చెబుతున్నారు. అదే పనిగా సదరు మంత్రిపై గతంలోనూ కొన్ని ఛార్జిషీట్లు కేసీఆర్ కోర్టులో పెండింగ్ లో ఉన్నాయంటున్నారు. సదరు నేతపై గులాబీ బాస్ మరేం చర్యలు తీసుకుంటారో చూడాలి.