Begin typing your search above and press return to search.
సిడ్నీలో కోహ్లీసేనకు తప్పిన పెనుముప్పు
By: Tupaki Desk | 15 Nov 2020 9:30 AM GMTఆస్ట్రేలియాలో భారత క్రికెట్ జట్టుకు పెనుముప్పు తప్పింది. ఆస్ట్రేలియా పర్యటనకు బయలు దేరిన వెళ్లిన టీమిండియా అక్కడ సిడ్నీలోని ఓ హోటల్ లో బస చేసింది. హోటల్ సమీపంలో తాజాగా భారీ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటన కోహ్లీ సేనను ఉలిక్కిపడేలా చేసింది. క్రికెట్ ఫ్యాన్స్ కంగారుపడ్డారు.
ఆస్ట్రేలియాతో బిగ్ బాష్ సిరీస్ కోసం భారత క్రికెట్ జట్టు ప్రస్తుతం ఆ దేశంలో పర్యటిస్తోంది. సిడ్నీలోని ఒలింపిక్ పార్క్ హోటల్ లో బస చేశారు. క్వారంటైన్ లో ప్రస్తుతం ఉంటున్నారు.
ఈ క్రమంలోనే ఇదే సిడ్నీలోని క్రోమర్ పార్క్ స్టేడియంలో ఓ చార్టెడ్ ఫ్లైట్ కుప్పకూలింది. ప్రమాదం జరిగిన ప్రాంతం హోటల్ కు దగ్గరలోనే ఉండడం విశేషం. దీంతో కోహ్లీ సేనకు పెను ప్రమాదం తప్పినట్టైంది.
ఇంజిన్ ఒక్కసారిగా స్తంభించిపోవడంతో ఈ విమానం కుప్ప కూలింది. స్టేడియంలో స్థానిక క్రికెటర్లు, ఫుట్ బాల్ ప్లేయర్లు మ్యాచ్ ప్రాక్టీస్ చేస్తున్నారు.వారంతా విమానం కూలడం చూసి భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే పారిపోయి ప్రాణాలు దక్కించుకున్నారు.
విమానం కూలిన ప్రదేశంలో ప్రజలు ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. విమానం ఇంజిన్ కనుక ఆలస్యంగా స్తంభించిపోయి ఉంటే భారత క్రికెటర్లు బస చేసిన హోటల్ పై పడేదని చెబుతున్నారు. ఇదే జరిగితే పెను విషాదం అలుముకునేది.