Begin typing your search above and press return to search.

మిస్ తెలంగాణపై పాశవిక దాడి

By:  Tupaki Desk   |   20 Feb 2019 6:07 AM GMT
మిస్ తెలంగాణపై పాశవిక దాడి
X
మిస్ తెలంగాణ -2018, అందమైన సాయి కామక్షి భాస్కర్లపై గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా దాడి చేసి గాయపరిచారు. కొందరు వ్యక్తులు విద్వేషపూర్వకంగానే ఈమెపై దాడి చేసినట్లు సమాచారం..

ఎంబీబీఎస్ చదువుతూ మిస్ తెలంగాణ-2018 పోటీల్లో ఫైనల్ చేరిన సాయి కామక్షి కిరీటం అందుకుంది. ఆ తర్వాత మిస్ ఇండియా 2018 పోటీల్లోనూ పాల్గొని ఫైనల్ వరకు చేరింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సాయి కామక్షి ఆ మధ్య అట్రాసిటీ పై న్యాయమైన మార్గంలో పయనించాలని వ్యాఖ్యానాలు చేసింది. దీనిపై పోరాటం కూడా చేసింది. ఆ విషయంలోనే కొందరు వాదనకు దిగింది. వారే సాయి కామక్షిపై దాడికి దిగారని ఆమె అనుమానాలు వ్యక్తం చేశారు.

సాయి కామక్షి దాడికి గురైనప్పటి చిత్రాలను సోషల్ మీడియాలో పంచుకుంది. ఆమె ముక్కు, నుదురు, నోటినుంచి తీవ్ర రక్తస్రావం అవుతున్న చిత్రాలు అందరినీ షాక్ కు గురిచేశాయి. ఆమె పెదవులు, నుదురు కట్ అయి రక్తం కారుతున్న దృశ్యాలు బీతావాహంగా ఉన్నాయి. శరీరంపై గాయాలను కూడా సాయి కామక్షి పంచుకుంది. దీన్ని బట్టి ఆమెపై చాలా కసిగా.. విద్వేషపూర్వకంగానే దాడి చేశారని అర్థమవుతోంది.

ఈ చిత్రాలు చూసిన నెటిజన్లు ఆమెపై సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. ఆమెపై దాడి చేసిన వారిపై చట్టబద్దంగా పోరాడేందుకు సాయి కామక్షి రెడీ అయ్యింది. పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమెకు సపోర్టుగా నిలవడానికి పలువురు ముందుకు వస్తున్నారు.