Begin typing your search above and press return to search.

ఒలింపిక్స్‌ గేమ్స్ లో తొలి రోజే భారత్ ప‌త‌కాల బోణీ కొట్టింది.

By:  Tupaki Desk   |   24 July 2021 7:46 AM GMT
ఒలింపిక్స్‌ గేమ్స్  లో తొలి రోజే భారత్ ప‌త‌కాల బోణీ కొట్టింది.
X
జపాన్ లో జరుగుతోన్న ఒలింపిక్స్‌ గేమ్స్ లో తొలి రోజే భారత్ ప‌త‌కాల బోణీ కొట్టింది. వెయిట్‌ లిఫ్టింగ్ 49 కేజీల విభాగంలో మీరాబాయ్ చాను సిల్వ‌ర్ మెడ‌ల్ గెలిచింది. 2000 సిడ్నీ ఒలింపిక్స్‌ లో క‌ర‌ణం మ‌ల్లీశ్వ‌రి తర్వాత వెయిట్‌ లిఫ్టింగ్‌ లో మెడ‌ల్ గెలిచిన తొలి అథ్లెట్‌ గా మీరాబాయ్ రికార్డ్ నమోదు చేసింది.

సిడ్నీ ఒలింపిక్స్‌ లో మన తెలుగు తేజం క‌ర‌ణం మ‌ల్లీశ్వ‌రి బ్రాంజ్ మెడ‌ల్ గెల‌వ‌గా, ఇప్పుడు మీరాబాయ్ సిల్వ‌ర్‌ తో మెరిసింది. టోక్యో ఒలింపిక్స్ 2020లో మీరాబాయి చాను అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. క్లీన్ అండ్ జెర్క్‌లో ఉన్న మిరాబాయి చాను వెయిట్ లిఫ్టింగ్‌లో 115 కిలోల బరువును విజయవంతంగా ఎత్తివేసింది. దీంతో ఆమె భారతదేశానికి మొదటి పతకం సాధించగలిగింది.

వెయిట్ లిఫ్టింగ్‌లో ఒలింపిక్ క్రీడల చరిత్రలో రెండవ పతకాన్ని మీరాబాయి చాను భారత్‌కు ఇచ్చారు. వెయిట్ లిఫ్టింగ్‌లో రజత పతకం సాధించిన తొలి మహిళా క్రీడాకారిణి మాత్రం మీరాబాయే. ఈ ఏడాది ఫస్ట్ ఒలింపిక్ మెడల్ సాధించి చరిత్ర సృష్టించారు చాను. మీరాబాయి చాను భారత్‌కు రజత పతకం సాధించగా , ఒలింపిక్ క్రీడల రెండవ రోజునే, భారతదేశం పతకాల జాబితాలో తన ఖాతాను తెరవగలిగింది.

స్నాచ్‌, క్లీన్ అండ్ జెర్క్ క‌లిపి ఆమె 202 కేజీల బ‌రువు ఎత్తింది. మ‌రోవైపు చైనా వెయిట్‌లిఫ్ట‌ర్ హౌ ఝిఝి 210 కేజీల‌తో గోల్డ్ మెడ‌ల్ గెల‌వ‌గా.. ఇండోనేషియాకు బ్రాంజ్ మెడ‌ల్ ద‌క్కింది. గోల్డ్ కోసం క్లీన్ అండ్ జెర్క్‌లో మీరాబాయ్ చివ‌రి ప్ర‌య‌త్నంలో 117 కేజీల బ‌రువు ఎత్త‌డానికి ప్ర‌య‌త్నించి విఫ‌ల‌మైంది.

టెన్నిస్ పురుషుల సింగిల్స్ ఈవెంట్‌లో భారత్‌కు చెందిన సుమిత్ నాగల్ తొలి మ్యాచ్ గెలిచాడు. ఉజ్బెకిస్తాన్ ఆటగాడిని ఓడించి పతక రేసులో సుమిత్ నాగల్ ఒక అడుగు ముందుకు వేశారు. విలువిద్య మిశ్రమ డబుల్స్ ఈవెంట్‌లో మాత్రం భారత్‌కు నిరాశ ఎదురైంది. క్వార్టర్ ఫైనల్లో దీపిక, ప్రవీణ్ జంట ఓడిపోయింది. కొరియా జత దీపిక-ప్రవీణ్‌లను ఓడించి సెమీస్‌లోకి ప్రవేశించింది.

ఆర్చ‌రీ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో భార‌త్ పోరు ముగిసింది. క్వార్టర్ ఫైన‌ల్‌లో భార‌త్ ఓట‌మి పాలైంది. 2-6 తేడాతో ద‌క్షిణ కొరియా చేతిలో భార‌త జోడీ దీపికా కుమారి, ప్ర‌వీణ్ జాద‌వ్ ఓడిపోయారు. ప్రీ క్వార్ట‌ర్ ఫైన‌ల్‌లో చైనీస్ తైపీపై 5-3 తేడాతో దీపికా కుమారి, ప్ర‌వీణ్ జాద‌వ్ అద్భుత విజ‌యం సాధించిన విష‌యం తెలిసిందే. ప్రీ క్వార్ట‌ర్ ఫైన‌ల్‌లో లిన్ చియా ఎన్, తంగ్ చిచ్ చూన్‌ను దీపికా కుమారి, జాద‌వ్ క‌లిసి ఓడించారు.

పురుషుల 10 మీ. ఎయిర్ పిస్ట‌ల్ విభాగంలో భార‌త్ ఫైన‌ల్‌కు చేరింది. ఈ విభాగంలో భార‌త షూట‌ర్ సౌర‌భ్ చౌద‌రీ ఫైన‌ల్‌కు అర్హ‌త సాధించాడు. 586 పాయింట్ల‌తో సౌర‌భ్ చౌద‌రీ అగ్ర‌స్థానంలో నిలిచాడు. ఇక ఈ విభాగంలో భార‌త షూట‌ర్ అభిషేక్ వ‌ర్మ అర్హ‌త సాధించ‌లేక‌పోయాడు. 575 పాయింట్ల‌తో అభిషేక్ వ‌ర్మ 17వ స్థానంలో నిలిచాడు.

టాప్ ఫామ్‌ లో ఉన్న ఇండియ‌న్ మెన్స్ హాకీ టీమ్ ఒలింపిక్స్‌ లో బోణీ కొట్టింది. పూల్ ఎ లో భాగంగా న్యూజిలాండ్‌ తో జ‌రిగిన మ్యాచ్‌ లో ఇండియా 3-2తో విజ‌యం సాధించింది. రెండు గోల్స్‌ తో హ‌ర్మ‌న్‌ ప్రీత్ సింగ్ విజ‌యంలో కీల‌క‌పాత్ర పోషించాడు. మొద‌ట న్యూజిలాండ్‌ కు కేన్ ర‌సెల్ గోల్ చేసి 1-0 లీడ్ సాధించి పెట్టాడు. అయితే ఆ త‌ర్వాత రూపింద‌ర్ పాల్ సింగ్ గోల్‌ తో స్కోరు స‌మం చేశాడు.

ఆ వెంట‌నే హ‌ర్మ‌న్‌ప్రీత్ మ‌రో గోల్ చేసి లీడ్‌ను 2-1కి పెంచాడు. సెకండ్ క్వార్ట‌ర్‌లోనూ హ‌ర్మ‌న్‌ప్రీత్ మ‌రో గోల్‌ తో టీమిండియా లీడ్ 3-1కి పెరిగింది. ఇక మూడో క్వార్ట‌ర్ చివ‌రి నిమిషంలో న్యూజిలాండ్ ప్లేయ‌ర్ స్టీఫెన్ జెన్నెస్ గోల్‌ తో టీమిండియా లీడ్‌ను 2-3కి త‌గ్గించాడు. చివ‌రి క్వార్ట‌ర్‌లో ఇండియా స్కోరును స‌మం చేయ‌డానికి న్యూజిలాండ్ ప్ర‌య‌త్నించినా.. ఇండియ‌న్ ప్లేయ‌ర్స్ స‌మ‌ర్థంగా అడ్డుకున్నారు. చివ‌రికి మ్యాచ్ ముగియ‌డానికి 24 సెక‌న్ల ముందు న్యూజిలాండ్‌కు పెనాల్టీ కార్న‌ర్ ల‌భించింది. ఇలా స్కోరు స‌మం చేసే అవ‌కాశం వాళ్ల‌కు దక్కినా.. గోల్ కీప‌ర్ శ్రీజేష్ దానిని అడ్డుకున్నాడు. దీంతో ఇండియ్ టీమ్ 3-2తో విజ‌యాన్ని సొంతం చేసుకుంది.