Begin typing your search above and press return to search.
మూగ అమ్మాయిపై మైనర్ల అత్యాచారం... నిందితుల్లో 11ఏళ్ల పిల్లోడు !
By: Tupaki Desk | 1 July 2020 3:00 PM ISTరోజు రోజుకి ఈ సమాజం ఎటు పోతుందో కూడా అర్థం కానీ పరిస్థితి. అసలు అమ్మాయికి ఈ దేశంలో రక్షణ లేకుండా పోతుంది. ఇంటి గడప దాటిన అమ్మాయి..మళ్లీ ఇంటికి వచ్చేవరకు వస్తుందో ? రాదో అన్న భయం తోనే ఇంట్లో వారు ఉండాల్సిన పరిస్థితి. ఎన్ని చట్టాలు ..ఎన్ని చర్యలు ..ఎంతమంది పోలీసులు ఉన్నా కూడా జరిగే ఘోరాలని ఆపలేకపోతున్నారు. తాజాగా మధ్యప్రదేశ్ లో దారుణ ఘటన వెలుగు చూసింది. 20ఏళ్ల మూగ యువతి పై నలుగురు మైనర్లు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
ఈ ఘటన పై పూర్తి వివరాలు చూస్తే ...ఛతర్ పూర్ జిల్లా లోని ఓ గ్రామాని కి చెందిన దంపతులకు ఓ 20 ఏళ్ల కూతురు ఉంది. పుట్టుకతోనే ఆమెకు మాటలు రాకపోవడంతో కుటుంబసభ్యులు జాగ్రత్తగా చూసుకుంటున్నారు. ఆదివారం రాత్రి ఆమె బహిర్భూమికి వెళ్లి ఎంత సేపటికి తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు చుట్టు పక్కల ప్రాంతాల్లో గాలించ గా రోడ్డు పక్కన గాయాల తో కనిపించింది. దీంతో ఆమెను వెంటనే సమీపం లోని ఆస్పత్రి కి తరలించి చికిత్స అందించారు. యువతిని పరీక్షించిన డాక్టర్లు ఆమెపై ఒకరి కంటే ఎక్కువ మంది అత్యాచారం చేసినట్లు చెప్పారు.
దీంతో బాధితురాలి కుటుంబసభ్యులు వెంటనే గౌరీహార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనితో బాధితురాలిని పరామర్శించిన పోలీసులు ఆమె నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. బాధితురాలు సైగలతో తనపై జరిగిన ఘోరాన్ని కళ్లకు కట్టినట్లు పోలీసులకు చెప్పింది. ఆమె చెప్పిన వివరాల ఆధారంగా నలుగురు నిందితులను సోమవారం అరెస్ట్ చేశారు. నిందింతుతలంతా 11 నుంచి 18 ఏళ్ల లోపు వారని పోలీసులు చెప్పారు. నిందితుల్లో ఒకరు 11 ఏళ్ల బాలుడని ఎస్పీ చెప్పడంతో అందరూ షాకయ్యారు. నిందితులు నేరం ఒప్పుకున్నారని పోలీసు సూపరింటెండెంట్ సచిన్ శర్మ తెలిపారు. కేసు తదుపరి దర్యాప్తు జరుగుతోంది.