Begin typing your search above and press return to search.

వైసీపీ ఎమ్మెల్యే ఆర్కేకు ప్రమాదం

By:  Tupaki Desk   |   29 Feb 2020 2:00 PM IST
వైసీపీ ఎమ్మెల్యే ఆర్కేకు  ప్రమాదం
X
మంగళగరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి తృటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. స్వల్ప గాయాలతో ఆయన బయటపడడంతో వైసీపీ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నారు.

గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లిలో ఓ వివాహ కార్యక్రమానికి రామకృష్ణ రెడ్డి హాజరయ్యారు. వధూవరులను ఆశీర్వదించేందుకు ఎమ్మెల్యే ఆర్కే వేదికపైకి వెళ్లగా.. వేదిక ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో ఆర్కే తో సహా వేదికపైనున్న వధూవరులు, నేతలు, బంధువులు కిందపడ్డారు.

ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే ఆర్కే కుడి కాలి పాదానికి గాయమైంది. స్వల్ప గాయాలే కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

ఆర్కేను చికిత్స కోసం వెంటనే గుంటూరు ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం ఇంటికి వెళ్లిపోయారు.

ఆర్కేకు ప్రమాదం అని తెలియగానే వైసీపీ కార్యకర్తలు, నేతలు ఆందోళన చెందారు. ఆయనను పరామర్శించారు. పెద్ద ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.