Begin typing your search above and press return to search.

వరుసకు పెద్ద నాన్న నాలుగేళ్ల చిన్నారి పై అంత దారుణం చేశాడు

By:  Tupaki Desk   |   2 Jan 2020 4:24 AM GMT
వరుసకు పెద్ద నాన్న నాలుగేళ్ల చిన్నారి పై అంత దారుణం చేశాడు
X
దారుణమైన నేరం చేసిన వారిని అదుపు లోకి తీసుకొని.. ప్రజలు కట్టే పన్ను సొమ్ము తో వాడ్ని మేపుతూ.. సుదీర్ఘకాలం సాగే న్యాయ విచారణకు సిద్ధం చేస్తూ.. దారుణమైన నేరం చేసిన ఐదేళ్లకో.. పదేళ్లకో శిక్షను కన్ఫర్మ్ చేయటం.. దానికి అప్పీలు.. క్షమాభిక్ష పేరుతో మరికొద్ది కాలం గడపటం.. చివరకు శిక్ష ను అమలు చేసే సమయానికి హక్కుల నేతలు రంగంలోకి దిగి.. ఒక మనిషి బతికి ఉండగా.. అతడెంత దారుణానికి పాల్పడినా.. ప్రాణాలు తీసే అవకాశం లేదంటూ దరిద్రపు గొట్టు వాదనల్ని వినిపిస్తారు.

అరే.. ఒకడు తన మానాన తాను బతుకుతుంటే తప్పు పని చేసి.. వాడి జీవితం లో మర్చిపోలేనంత వేదనను మిగిల్చి.. వారి కుటుంబంలో విషాదం నింపటానికి నిందితుడికి హక్కు ఉన్నప్పుడు.. అలాంటి రాక్షసుల సంగతి తేల్చే విషయంలో మాత్రం వారికి ఉండాల్సిన హక్కుల గురించి మాత్రం హక్కుల నేతలకు గుర్తుకు రావటాన్ని పలువురు తప్పు పడతారు.

తాజాగా జరిగిన ఉదంతం చూసినప్పుడు.. ఇలాంటి పని చేసినోడ్ని కూడా హక్కుల కార్యకర్తలు ఎలాంటి వాదన వినిపిస్తారో అన్న భావన కలుగక మానదు. వరుసకు పెద్దనాన్న అయ్యే వ్యక్తి నాలుగేళ్ల చిన్నారిపై ఆఘాయిత్యానికి పాల్పడిన వైనం గురించి తెలిస్తే.. రక్తం మరిగిపోవటమే కాదు.. అలాంటి నీచుడ్ని ఏం చేసినా ఫర్లేదన్న భావన కలుగక మానదు.

ఇలాంటి వేళలోనే.. నిందితుల హక్కుల గురించి మాట్లాడే హక్కుల నేతలు చప్పున గుర్తుకు వస్తారు. ఇలాంటి ఘటనల మీద వారు రియాక్ట్ కావాల్సిన అవసరం ఉందని చెప్పక తప్పదు. అసలేం జరిగిందంటే..

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం కోనంపేట లో చోటు చేసుకున్న ఈ ఉదంతంలో తన నాలుగేళ్ల చిన్నారితో కలిసి తల్లి భారతి నిద్రిస్తోంది. మధ్య రాత్రి మెలుకువ రాగా.. తన కుమార్తె పక్కలో లేక పోవటంతో షాక్ తింది. వెంటనే చుట్టుపక్కల వారిని లేపి చిన్నారి ఆచూకీ కోసం వెతికారు.

తెల్లవారుజామున ఏడు గంటల ప్రాంతంలో గ్రామ సమీప చెట్ల పొదల్లో చిన్నారి ఏడుపు వినపడటంతో అక్కడకు వెళ్లారు. చిన్నారి ఒంటి మీద దుస్తులు లేకపోవటం.. ఒంటి నిండా గాయాలు కనిపించటంతో ఆమెను తీసుకొచ్చారు. ఏమైందని అడగ్గా.. పెద్దనాన్న అని ఏడుస్తూ చెప్పింది. దీంతో.. ఆ రాక్షసుడి కోసం వెతికితే అతడు కనిపించలేదు. నిందితుడి పై ఫోక్సో.. ఎస్సీ.. ఎస్టీ అగ్రాసిటీ.. నిర్భయ లాంటి చట్టాల ప్రకారం కేసు పెట్టారు. ఇన్ని కేసులు పెట్టారు సరే. కేసు పూర్తి అయి.. నిందితుడికి శిక్ష పడేది ఎప్పుడు? అమలయ్యేది ఎప్పుడు? అన్నది క్వశ్చన్ గా చెప్పక తప్పదు. ఇలాంటి రాక్షసుడికి యుద్ధ ప్రాతిపదికన శిక్ష విధించాల్సిన అవసరం ఉంది.