Begin typing your search above and press return to search.
ఘోరం : మైనర్ అమ్మాయిపై 6 నెలలుగా 400 మంది అత్యాచారం...!
By: Tupaki Desk | 15 Nov 2021 10:37 AM GMTఆడవారిపైజరిగే నేరాలు రోజురోజూకు పెరిగిపోతున్నాయి. వావి వరసలు మరచి, మృగాళ్లుగా మారుతున్నారు. పసిపిల్లల నుంచి పండు ముసలి వరకు ఆడవారు కనిపిస్తే ఎవరినీ వదలట్లేదు ఈ కామాంధులు. ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా, ఎంతమంది పోలీసులు రాత్రి , పగలు అన్న తేడా లేకుండా గస్తీ కాస్తున్నా ఆడవారిపై ఈ కీచకులు అఘాయిత్యాలు ఆగడం లేదు. తాజాగా ఇలాంటి దారుణ ఘటనే ఒకటి వెలుగు చూసింది. మహారాష్ట్రలో దారుణం చోటుచేసుకుంది. ఆరు నెలలుగా మైనర్ బాలికపై దాదాపు 400 మంది మృగాళ్లు అత్యాచారానికి పాల్పడ్డారు. ప్రస్తుతం బాధితురాలు రెండు నెలల గర్భవతి. ఈ దారుణానికి ఒడిగట్టిన వారిలో ఓ పోలీసు అధికారి కూడా ఉండటం గమనార్హం.
మహారాష్ట్ర బీద్ జిల్లాకు చెందిన మైనర్ బాలిక తల్లి రెండు సంవత్సరాల క్రితం మరణించింది. ఈ క్రమంలో బాలిక తండ్రి ఆమెకు వివాహం చేశాడు. అత్తవారింట్లో బాధితురాలు ప్రత్యక్ష నరకం అనుభవించింది. బాధితురాలి మామ ఆమెను నిత్యం వేధించేవాడు. దీనితో పుట్టింటికి వచ్చేసింది. అక్కడ కొద్ది రోజులు ఉన్న తర్వాత, పెళ్లైన ఏడాది తర్వాత బాధితురాలు ఉద్యోగం కోసం అంబేజోగై పట్టణానికి వెళ్లింది. అక్కడ ఆమెకు ఇద్దరు వ్యక్తులు పరిచయం అయ్యారు. ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మబలికి.. బాధితురాలిని శారీరంగా లొంగదీసుకున్నారు. అక్కడితో ఆగని మృగాళ్లు దీని గురించి ఆమె భర్తకు చెప్తామని బెదిరిస్తూ, వారి స్నేహితుల వద్దకు పంపేవారు.
ఇలా వందలమంది మృగాళ్లు బాధితురాలిపై పైశాచిక చర్యకు పాల్పడ్డారు. దాదాపు 400 మంది బాధితురాలిపై అఘాయిత్యానికి పాల్పడగా, వీరిలో ఒక పోలీసు అధికారి కూడా ఉండటం గమనార్హం. నిందితుల బారి నుంచి ప్రాణాలతో బయటపడిన ఆమె రెండు నెలల గర్భిణి. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నలుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. బాలికకు మెరుగైన చికిత్స అందేలా చర్యలు చేపడుతున్నారు.