Begin typing your search above and press return to search.

ఎమ్మెల్యేల పై అసహనం వ్యక్తం చేసిన మంత్రి ...ఏమైందంటే ..?

By:  Tupaki Desk   |   14 Nov 2019 5:59 AM GMT
ఎమ్మెల్యేల పై అసహనం వ్యక్తం చేసిన మంత్రి ...ఏమైందంటే ..?
X
రాష్ట్ర రాజకీయాల లో అనంతపురానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. అభివృద్ధి పరంగా కొంచెం వెనుక బడిన జిల్లాగా ఉన్నప్పటికీ , రాజకీయం గా మాత్రం అనంతపురం అందరికి అందనంత ఎత్తు లో ఉంటుంది. దీనికి ప్రధాన కారణం అక్కడ ఉన్న నేతలే. అనంత రాజకీయ నేతల కి పార్టీలు , జెండాలు ముఖ్యం కాదు. తమ ఎదుట ఎంతటి వాడు ఉన్నా కూడా చెప్పాల్సింది నిర్మొహ మాటంగా చెప్పేస్తారు. రాజకీయం మారుతున్నా ... అక్కడి నేతల తీరు మాత్రం మారదు. ఆ జిల్లాలో ఏదైనా ఒక సమస్యని పరిష్కరించాలి అంటే .. కత్తిమీద సాము లాంటిదే. ఈ విషయాన్ని ప్రస్తుత ప్రభుత్వం చాల త్వరగా అర్థం చేసుకున్నది.

ఎందుకు అంటే ..ఏపీలో వైసీపీ అధికారం చేపట్టిన తర్వాత.. జిల్లా అభివృద్ధి ఇప్పటివరకు మీద మూడు రివ్యూలు జరిగాయి. ఇందులో ఒకటి జిల్లా మంత్రి శంకర నారాయణ ఆధ్వర్యం లో జరగ గా.. మరొకటి మాజీ ఇన్‌ఛార్జి పెద్దిరెడ్డి రామ చంద్రారెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. ఇక మూడవ ది ప్రస్తుత ఇన్ ఛార్జి మంత్రి బొత్స సత్య నారాయణ ఆధ్వర్యం లో జరిగింది. ఇలా మూడు రివ్యూ మీటింగ్‌లు జరిగితే.. మూడు మీటింగు ల్లోనూ ఒకటే సీన్ రిపీట్ అయ్యింది. అదేమిటి అంటే ..నీటి సమస్య.

కరువు జిల్లా గా అనంతపురం రికార్డ్స్ లోకి ఎక్కింది. దేశం మొత్తంలో అత్తి తక్కువ వర్ష పాతం ఉండే జిల్లాల లో ఈ అనంతపురం కూడా ఒకటి. అనంతపురం జిల్లా కు ఉన్న నీటి వనరులు ముఖ్యమైనవి రెండే రెండు. అందులో ఒకటి తుంగభద్ర ఎగువ కాలువ అయిన HLC.. కాగా మరొకటి శ్రీశైలం బ్యాక్ వాటర్ మీదుగా ఏర్పాటైన హంద్రీనీవా ప్రాజెక్టు. ఈ రెండే జిల్లాకు ప్రధానమైన ఆధారం. అయితే ఇప్పుడు అన్నీ నియోజక వర్గాలకు నీరు కావాలంటూ ఎమ్మెల్యేలు డిమాండ్‌ చేస్తుండటం తో.. అధిష్టానం ఏమిచేయాలో తెలియక దిక్కుతోచని స్థాయిలో ఉంది.

ఇటీవలే కొత్తగా ఇంచార్జ్‌ బాధ్యతలు చేపట్టిన మంత్రి బొత్స సత్యనారాయణ.. అనంతపురం జిల్లా లో పర్యటించారు. ఈ సందర్భంగా జిల్లా కు చెందిన ఎమ్మెల్యేల తో ఓ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఈ సమావేశం లో తమ నియోజక వర్గానికి నీళ్లు కావాలంటే.. తమ నియోజక వర్గానికి కావాలంటూ ఉపన్యాసాలు ఇచ్చారట ఎమ్మెల్యే లు. కాగా, జిల్లా లో మెజార్టీ ఎమ్మెల్యే లు వైసీపీ నేతలే కావడం మరో విశేషం. కానీ నేతల మధ్య సరైన కోఆర్డినేషన్‌ లేకుండా.. ఎవరికి వారు నీటి గురించి డిమాండ్ చేయడంతో.. ఇంచార్జ్‌‌గా ఉన్న మంత్రి ఏం చేయాలో తెలియక తికమక పడుతున్నారట. ట్రబుల్ షూటర్ గా గుర్తింపు ఉన్నా బొత్స ఈ సమస్య ని ఏ విదంగా పరిష్కరిస్తారో చూడాలి.