Begin typing your search above and press return to search.
గుడ్డోడా కూర్చో మంత్రి వ్యాఖ్య.. నువ్వో ఇడియట్ వి.. ఎమ్మెల్యే ఫైర్
By: Tupaki Desk | 2 Dec 2020 9:45 AM ISTరాజకీయంగా విభేదాలు ఉండొచ్చు. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవచ్చు. కానీ.. అవన్నీ హుందాగా ఉండాలి. వ్యక్తిగతంగా అస్సలు ఉండకూడదు. కానీ.. ఏపీ శాసనమండలిని చూస్తే.. ఇలాంటి పట్టింపులు లేని దుస్థితి. ప్రత్యర్థిపై ఇష్టం వచ్చినట్లుగా తిట్టిపోయటం.. ఎంత మాట పడితే అంత మాట అనేయటం.. వ్యక్తిగత విమర్శలు చేయటం ఈ మధ్యన ఎక్కువ అవుతోంది. దీంతో.. సభలో సభ్యుల మధ్య ఉండాల్సిన గౌరవ మర్యాదలు మంటగలిసే పరిస్థితి.
తాజాగా ఏపీ మండలిలో మంత్రి.. విపక్ష ఎమ్మెల్సీ మధ్య నడిచిన మాటల యుద్ధం.. ఒక దశలో మరింత దిగజారింది. వ్యక్తిగత విమర్శల వరకు వెళ్లింది. అలాంటి పరిస్థితి ఎందుకు ఏర్పడిందన్న విషయంలోకి వెళితే.. మంగళవారం మండలిలో పంచాయితీరాజ్ బిల్లుపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా కొన్ని సవరణల్ని ప్రతిపాదించారు టీడీపీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్. తాను ప్రతిపాదించిన సవరణ గురించి సభలో చదువుతూ.. తాను చేస్తున్న సూచనలు ప్రభుత్వానికి ఉపయోగపడతాయన్నారు.
తాజా బిల్లు ప్రభుత్వానికి ఉపయోగపడుతుందన్న ఆయన.. ప్రస్తుతం ప్రభుత్వం ఎన్నికలు పెట్టటానికే భయపడుతుందని.. అలాంటప్పుడు బిల్లుతో పనేమిటని విమర్శించారు. దీనికి స్పందించిన మంత్రి వెల్లంపల్లి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ మాటలకు అడ్డుతగులుతూ.. అనవసరమైన మాటలు ఎందుకు? అని మండిపడ్డారు. దీనికి రాజేంద్రప్రసాద్ స్పందిస్తూ.. ముందు సింహాలు ఏమయ్యాయో చూడు సామీ అంటూ చురక వేశారు.
ఎందుకంటే.. రాజేంద్రప్రసాద్ ప్రస్తావించిన బిల్లు పంచాయితీ రాజ్ శాఖకు చెందింది కాగా.. ఆయన మాటలకు అడ్డుపడుతున్న మంత్రి దేవాదాయ శాఖ మంత్రి కావటం.. ఇటీవల రథం తగలబడిపోయిన ఉదంతాన్ని ప్రస్తావిస్తూ.. రథం తగలబడింది పట్టించుకోలేదు.. ఇది పంచాయితీరాజ్ శాఖకు సంబంధించింది.. నీ శాఖకు సంబంధం ఏమిటి? అని ఆయనకు తగిలేలా వ్యాఖ్యలు చేశారు.
దీంతో.. మంత్రి వెల్లంపల్లి తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. గుడ్డోడా కూర్చో అంటూ వ్యక్తిగత విమర్శలకు దిగారు. దీంతో.. తీవ్ర ఆగ్రహానికి గురైన వైవీబీ మంత్రిని ఉద్దేశించి నువ్వో ఇడియట్ వంటూ ఫైర్ అయ్యారు. రాజకీయంగా వైరుధ్యం ఉండొచ్చు. అంతమాత్రానికే విపక్ష నేత చేసే విమర్శలకు.. బ్యాలెన్సు మిస్ అయి ఘాటు వ్యాఖ్యలు చేయటం గమనార్హం.