Begin typing your search above and press return to search.

క్యాసినో కేసులో ఈడీ నోటీసులపై స్పందించిన మంత్రి తలసాని కుమారుడు

By:  Tupaki Desk   |   22 Nov 2022 4:06 AM GMT
క్యాసినో కేసులో ఈడీ నోటీసులపై స్పందించిన మంత్రి తలసాని కుమారుడు
X
క్యాసినో కేసులో టీఆర్ఎస్ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు బిగ్ షాక్ తగిలింది. ఇప్పటికే తలసాని బ్రదర్స్, తలసాని పీఏకు ఈడీ నోటీసులు ఇచ్చి విచారణ చేసింది. తాజాగా తలసాని కుమారుడు సాయికి కూడా ఈడీ నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తోంది. తలసాని బ్రదర్స్, పీఏ ఇచ్చిన సమాచారంతోనే సాయికి నోటీసులు ఇచ్చారని సమాచారం.

తెలుగు రాష్ట్రాల నుంచి పక్కదేశాలకు క్యాసినో వ్యవహారంలో తరలించిన కేసులో చీకోటి ప్రవీణ్ ను ఈడీ విచారించింది. అతడి నుంచి పలు రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. అందులో టీఆర్ఎస్ నేతలకు సంబంధించిన లావాదేవీలు ఉన్నాయని.. అందుకే వారిని పిలిపించారని అంటున్నారు. చీకోటి ప్రవీణ్ హవాలా దందాను కూడా భారీ ఎత్తున చేపట్టినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి.

చీకోటి ప్రవీణ్ తో కలిసి ఈ ఇద్దరు విదేశాలకు వెళ్లి క్యాసినో ఆడినట్లుగా ఇప్పటికే ఈడీ అధికారులు గుర్తించారు. చీకోటి ప్రవీణ్ జరిపిన లావాదేవీల్లో తలసాని సోదరులు మహేష్, ధర్మేందర్ యాదవ్ పేర్లు బయటకు రావడంతో అధికారులు పిలిచి విచారణ చేపట్టారు. హవాలా, ఫేమా ఉల్లంఘన కింద ఇద్దరినీ విచారిస్తున్నట్టుగా అధికారులు వెల్లడించారు. ఇప్పటికే ఈడీ అధికారులు చీకోటి ప్రవీణ్ క్యాసినో కేసులో చాలా మందిని విచారణకు పిలిచారు. కానీ ఇప్పుడు తలసాని సోదరులను, ఆయన కుమారుడిని టార్గెట్ చేయడం సంచలనమైంది.

తాజాగా క్యాసినో కేసులో తలసాని శ్రీనివాస్ యాదవ్ కొడుకు సాయికిరణ్ కు ఈడీ నోటీసులు జారీ చేయడం సంచలనమైంది. ఈ వార్తలపై సాయికిరణ్ స్పందించాడు. ఈడీ తనకు ఎలాంటి నోటీసులు పంపలేదన్నారు. అలాంటి ప్రయత్నం కూడా జరగలేదని స్పష్టం చేశారు.

ప్రజలకు సేవ చేసేందుకు వస్తున్న యువ నాయకుడిని, మీడియా సహకరించాలని ట్వీట్ చేశారు. అవాస్తవ వార్తలు రాయవద్దని.. విష ప్రచారం చేయవద్దని కోరారు.

ఇక తాజాగా తలసాని పీఏ హరీష్ తోపాటు వ్యాపారస్థుడు బుచ్చిరెడ్డిలు ఈడీ విచారణకు హాజరయ్యారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.