Begin typing your search above and press return to search.

మంత్రి సురేష్ కాన్వాయ్ ఢీకొని వ్యక్తి మృతి

By:  Tupaki Desk   |   9 Dec 2021 8:00 PM IST
మంత్రి సురేష్ కాన్వాయ్ ఢీకొని వ్యక్తి మృతి
X
ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఓ వ్యక్తి ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. అతడి భార్య తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. పెద్దారవీడు మండలం గొబ్బూరు సమీపంలో బైక్ పై వెళుతోన్న దంపతులను ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ కాన్వాయ్ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 38 ఏళ్ల మహేష్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు.

అతడి భార్య‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన జరిగిన వెంటనే ఆమెను స్థానికులు హుటాహుటిన చికిత్స కోసం సమీప ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాద వార్త తెలుసుకున్న పోలీసులు..ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడికావాల్సి ఉంది. కాగా, ఈ ప్రమాదంపై సురేష్ స్పందించాల్సి ఉంది.