Begin typing your search above and press return to search.

రాజ‌ధానిపై మంత్రి సీదిరి ఫైర్‌.. ఇంకా క‌మ్మ‌రావ‌తేనా?

By:  Tupaki Desk   |   6 March 2022 7:44 AM GMT
రాజ‌ధానిపై మంత్రి సీదిరి ఫైర్‌.. ఇంకా క‌మ్మ‌రావ‌తేనా?
X
కింద ప‌డ్డా పైచేయి నాదే అనే టైపులో వ్య‌వ‌హ‌రిస్తున్నారు వైసీపీ నాయ‌కులు, మంత్రులు కూడా! తాజాగా రాజ‌ధాని అమ‌రావ‌తి విష‌యంపై హైకోర్టు సంచ‌ల‌న తీర్పు వెలువ‌రించింది. రాజ‌ధానిని మార్చేందుకు వీల్లేద‌ని.. రాజ‌ధానిని అభివృద్ధి చేయాల్సిందేన‌ని.. రైతుల‌కు అన్యాయం చేస్తే..ఊరుకునేది లేద‌ని.. స్ప‌ష్టం చేసింది.

ఇక‌, దీనికి ముందు.. వైసీపీ ప్ర‌భుత్వం చేసిన విమ‌ర్శ‌లు.. ఇక్క‌డ ఇన్‌సైడ‌ర్ ట్రేడింగ్ జ‌రిగింద‌ని.. ఎస్సీల‌కు అన్యాయం చేశార‌న్న వాద‌న‌ను హైకోర్టు నుంచి సుప్రీం కోర్టు వ‌రకు తోసిపుచ్చిన విష‌యం తెలిసిందే.

అయితే.. ఇంత జ‌రుగుతున్నా.. కూడా వైసీపీ నేత‌ల్లో మార్పు రావ‌డం లేదు. ఒక‌వైపు న్యాయ‌స్థానాలు అమ‌రావ‌తిని కాపాడాల‌ని.. రాష్ట్ర ప‌రువును కాపాడాల‌ని అభ్య‌ర్థిస్తున్నా.. ఎవ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేదు. పైగా మ‌రింత‌గా రెచ్చిపోతున్నారు. తాజాగా సీదిరి అప్ప‌ల‌రాజు.. అమ‌రావ‌తిపై మ‌రింత ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. అది అమ‌రావ‌తి కాద‌ని, క‌మ్మ‌రావ‌తని అప్పలరాజు చేసిన వ్యాఖ్య‌లు పెను దుమారం రేపుతున్నాయి.

3 రాజధానులను చంద్రబాబు అడ్డుకుంటున్నారని, ప్రతి విషయంపై చంద్రబాబు కోర్టుకెళ్లి ఇష్టానుసా రంగా వ్యవహరిస్తున్నారని మంత్రి అప్పలరాజు విమర్శించారు. తాము అధికార వికేంద్రీకరణకు కట్టుబడి ఉన్నామని, ఎన్ని అడ్డంకులు వచ్చినా మూడు రాజధానులపై జగన్ ముందుకెళ‌తార‌ని ధీమా వ్యక్తం చేశారు.

ఇక‌, మ‌రో మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ కూడా ఇదే వ్యాఖ్య‌లు చేశారు. మూడు రాజ‌ధానుల‌కే తాము క‌ట్టుబ‌డి ఉంటామ‌ని.. త‌మ పార్టీ విధానం.. త‌మ ప్ర‌భుత్వ విధానం రాష్ట్రం స‌ర్వ‌తోముఖాభివృద్ధేన‌ని చెప్పారు. మూడు రాజ‌ధానుల అంశంపై త్వ‌ర‌లోనే షాకింగ్ నిర్ణ‌యాలు తీసుకుంటామ‌న్నారు.

మ‌రోవైపు గుంటూరుకే చెంది న హోం మంత్రి మేక‌తోటి సుచ‌రిత కూడా ఇలాంటి వ్యాఖ్య‌లే చేశారు. మూ డు రాజ‌ధానుల‌కే క‌ట్టుబ‌డి ఉన్నామ‌న్నారు. స‌రైన స‌మ‌యంలో స‌రైన విధంగా సీఎం జ‌గ‌న్ స్పందిస్తార ని.. అమ‌రావ‌తిపై హైకోర్టు తీర్పు చెప్పిన త‌ర్వాత ఆమె వ్యాఖ్యానించారు.

ఈ క్ర‌మంలోనే సుప్రీం కోర్టు కు వెళ్లే ఆలోచ‌న కూడా చేస్తున్న‌ట్టు నాయ‌కులు వెల్ల‌డిస్తున్నారు. ఇదిలావుంటే.. అమరావతిపై ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పు నేప‌థ్యంలో ఆ ప్రాంత రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వారంతా సంబరాలు చేసుకుంటున్నారు.