Begin typing your search above and press return to search.
వైరల్ గా తెలంగాణ మంత్రి వారి అవకాయ పచ్చడి తయారీ
By: Tupaki Desk | 28 May 2020 12:45 PM ISTకీలక స్థానాల్లో ఉన్నా.. వ్యక్తిగత జీవితం అంటూ ఒకటి ఉంటుంది. అలాంటివాటికి సంబంధించిన విషయాలు ప్రజల్లో ఆసక్తి వ్యక్తమవుతుంటుంది. అయితే.. ఇలాంటి వాటితో వచ్చే ఇబ్బంది ఏమంటే.. ఎంత మైలేజీ వస్తుందో.. కొన్ని సందర్భాల్లో అందుకు భిన్నంగా మిస్ ఫైర్ అయ్యే అవకాశం ఉంది. అలాంటి వాటితో జరిగే డ్యామేజ్ భారీగా ఉంటుంది.
ఇంతకీ ఈ విషయాన్ని ఇప్పుడు ఎందుకు ప్రస్తావించాల్సి వచ్చిందంటే.. తెలంగాణరాష్ట్రంలో మహిళా మంత్రిగా బాధ్యతల్ని నిర్వర్తిస్తున్న సీనియర్ నేత సబితా ఇంద్రారెడ్డి ఇంట్లో తానే స్వయంగా ఆవకాయ పచ్చడి పెట్టిన వైనం ఇప్పుడు వైరల్ గా మారింది.
అత్యున్నత స్థానంలో ఉండి.. క్షణం తీరిక లేనంత బిజీ షెడ్యూల్ లోనూ.. ఒక సాధారణ మహిళ మాదిరి తానే స్వయంగా మామిడికాయ పచ్చడి పెట్టిన వీడియో ఒకటి వైరల్ గా మారింది. పెద్దప్లాస్టిక్ టబ్బులో ఎర్రటి కారాన్ని మామిడి ముక్కలతో కలుపుతున్న వైనం చూస్తే.. సబితమ్మలో సగటు అమ్మ కనిపించటం ఖాయం.
ఎంత ఎత్తు ఎదిగినా.. ఇంటికి వచ్చేసరికి అమ్మగా మారిన వైనాన్ని పలువురు ప్రశంసిస్తున్నారు. కాకుంటే.. ఇలాంటి వీడియోలు విడి రోజుల్లో అయితే.. ఆ ఆదరణ వేరుగా ఉండేదన్న మాట వినిపిస్తోంది. లాక్ డౌన్ లాంటి ప్రత్యేక పరిస్థితుల్లో.. మిస్ ఫైర్ అయ్యే ప్రమాదం పొంచి ఉందంటున్నారు. ఏమైనా.. కీలక స్థానంలో ఉండి ఇంటికి సంబంధించిన పనుల్ని తానే స్వయంగా చూసుకుంటానన్న విషయం తాజా ఎపిసోడ్ తో స్పష్టమైందని చెప్పక తప్పదు.
ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి పనిని ఎవరో ఒకరికి అప్పజెప్పటం మామూలే. పచ్చడి లాంటివైతే.. రెడీ మెడీగా దొరికేవి బోలెడన్ని. అందుకు భిన్నంగా సబిత తనకు తానే స్వయంగా తయారు చేసిన వైనానికి మాత్రం ఫిదా కావాల్సిందే. ఇంత వయసులోనూ ఇంత ఓపికతో పచ్చడి పెట్టటాన్ని అభినందించాల్సిందే.