ఖమ్మం జిల్లాలో అధికార పార్టీ నేతల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్యుద్ధం నడుస్తోంది. నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో బీఆర్ ఎస్ పార్టీ నాయకుడు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ను ఎదిరించిన వారి గతి చిప్పకూడు తినడమేనని చాలా తీవ్రంగా స్పందించారు. మాజీ ఎంపీ.. ప్రస్తుతం రాజకీయ ఊగిసలాటలో ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డిని ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
ఖమ్మం జిల్లాలోని వైరాలో ఎమ్మెల్యే రాములునాయక్ అధ్యక్షతన నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావే శం నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన పువ్వాడ పొంగులేటి తీరుపై తీవ్రంగా స్పందించారు. దమ్ముంటే తనను పార్టీ నుంచి బహిష్కరించాలని ప్రకటించిన పొంగులేటి.. తనకు తానే రాజీనామా చేయాలని సవాల్ విసిరారు. పార్టీ బీ-ఫామ్తో గెలిచిన వాళ్లను బహిష్కరించామని ఏ పదవీ లేని చెల్లని చీటీ పొంగులేటి అంటూ ఎద్దేవా చేశారు.
గతంలో వైరా నుంచి సీపీఐ అభ్యర్థిగా పోటీ చేసిన బాణోతు విజయాబాయి ఇటీవల పొంగులేటికి మద్దతుగా నిలిచిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆమెను పొంగులేటి ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడం చర్చ నీయాశంగా మారింది. ఈ క్రమంలోనే పువ్వాడ తాజాగా పొంగులేటిపై విరుచుకుపడ్డారు. కేసీఆర్ను ఎదురిం చిన వారంతా కాలగర్భంలో కలిశారని.. ప్రస్తుతం విమర్శలు చేస్తున్న వారికీ అదే గతి పడుతుందని అన్నా రు. ఇక దీనిపై పొంగులేటి ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.