Begin typing your search above and press return to search.

సచివాలయం లోనే.. మంత్రి ఫోనే పోయింది

By:  Tupaki Desk   |   6 Feb 2020 4:00 PM IST
సచివాలయం లోనే.. మంత్రి ఫోనే పోయింది
X
రాష్ట్ర పాలనకు కేంద్రం సచివాలయం. అత్యంత బందోబస్తు ఉండే ప్రాంతం.. వేయి కళ్లతో నిఘా ఉంటుంది. ప్రజాప్రతినిధులు, అధికారులు ఉండే స్థలం.. ఆయనే ఓ మంత్రి.. కీలకమైన శాఖలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తన శాఖలపై సమీక్షలు చేసిన అనంతరం జేబు తడిమి చూసుకుంటే అతడి ఫోన్ కనిపించ లేదు. పక్కన వ్యక్తులు, సిబ్బంది, భద్రత బలగాలను వద్ద వాకబు చేస్తే అతడి ఫోన్ దొంగతనానికి గురైంది. ఈ వార్త ఆ నోట ఈ నోట పాకి ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అది సచివాలయం లో.. అది రాష్ట్ర మంత్రి ఫోన్ దొంగతనానికి గురైందంటే దానిపై సర్వత్రా విమర్శల తో పాటు కామెంట్లు వస్తున్నాయి.

అసలేం జరిగిందంటే..ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత రాజధాని అమరవాతి లోని సచివాలయం లో ఇటీవల సమాచార, పౌర సరఫరాల సంబంధాల శాఖ మంత్రి పేర్ని నాని సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం పలు సమావేశాల్లో పాల్గొన్నారు. సందర్శకులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం క్యాంటీన్ లో భోజనం చేశారు. ఆ సమయంలో తన మొబైల్ ఫోన్ ను చూసుకుంటే కనిపించ లేదు. ఎంత వెతికినా ఫోన్ లభించ లేదు. తన వ్యక్తిగతతో పాటు భద్రతా సిబ్బందిని ఫోన్ విషయమై ఆరా తీశారు. మంత్రి ఫోన్ చోరీకి గురైందన వార్త హాట్ టాపిక్ గా మారింది. వెంటనే పోలీసులు మంత్రి ఫోన్ ను ట్రేస్ చేయగా.. అప్పటికే ఫోన్ రాష్ట్రం దాటేసి తెలంగాణ లోని నల్గొండ జిల్లాలో ఉన్నట్లు చూపియడం తో అవాక్కయ్యారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిమిషాల వ్యవధిలోనే మంత్రి ఫోన్ చోరీకి గురవడం, రాష్ట్ర సరిహద్దు దాటడం వంటివి మామూలు విషయం కాదు. మంత్రికే సచివాలయం లో భద్రత లేదు. ఇక సామాన్యులకు సచివాలయం లోనే కాకుండా రద్దీ ప్రాంతాల్లో భద్రత ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చని కొందరు వ్యంగ్యం గా ప్రశ్నిస్తున్నారు.