Begin typing your search above and press return to search.

హత్యాయత్నం పై స్పందించిన మంత్రి నాని

By:  Tupaki Desk   |   29 Nov 2020 11:15 PM IST
హత్యాయత్నం పై స్పందించిన మంత్రి నాని
X
ఏపీ రవాణాశాఖ మంత్రిపై హత్యాయత్నం తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. మచిలీపట్నంలోని ఆయన నివాసం వద్ద నాగేశ్వరరావు అనే వ్యక్తి తాపీతో మంత్రిపై దాడి చేశాడు. మంత్రి నాని ఈ ఘటనలో తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఈ ఘటనపై తాజాగా పేర్ని నాని స్పందించాడు.

‘మా ఇంటి గేటు వద్ద ఒక వ్యక్తి తన కాళ్లపై పడ్డాడని.. ఎవరో గుర్తించేలోగానే పొడిచేందుకు ప్రయత్నించాడని’ మంత్రి నాని తెలిపాడు. తప్పించుకోగా మరోసారి పొడవాలని చూశాడని తెలిపారు. వెంటనే తన అనుచరులు అతడిని పట్టుకొని పోలీసులకు అప్పగించారని వివరించాడు. ఎందుకు దాడి చేశాడో తెలియదని.. పోలీసులు విచారణ జరుపుతున్నారని మంత్రి నాని వివరించారు.

కృష్ణా జిల్లా ఎస్పీ కూడా దీనిపై మాట్లాడారు. మంత్రి పేర్ని నానిపై దాడి ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని.. హత్యాయత్నం కేసు నమోదు చేశామని తెలిపారు. కొద్దిరోజులుగా పనిలేకపోవడంతో ఆ తాపీ మేస్త్రీ ఈ ఘటనకు పాల్పడ్డారని వెల్లడించారు. పూర్తి విచారణ తర్వాత హత్యాయత్నంకు సంబంధించిన వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.